32.2 C
Hyderabad
April 20, 2024 21: 38 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో మెలగాలి

PIB Venkateswer

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా జర్నలిస్టులు పని చేయాలని పత్రికా సమాచార కార్యాలయ దక్షిణాది రాష్ట్రాల డైరక్టర్ జనరల్ ఎస్.వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పత్రికా సమాచార కార్యాలయం, ఉస్మానియా జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలో జరిగిన జర్నలిస్టుల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు.

ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నాయని , అవి ప్రజలకు చేరువయ్యేలా చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని వెంకటేశ్వర్ సూచించారు.

సామాజిక మాధ్యమాలు వినియోగించడంలో కూడా మరింతగా మెళకువలు నేర్చుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ఖచ్చితమైనవో కావో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు  ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తోన్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

విధి నిర్వహణలో మరణించిన వారు, ప్రమాదంలో  అంగవైకల్యం పొందిన వారు, తీవ్ర అనారోగ్యం పాలైన  జర్నలిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఈ సహాయం పొందడానికి pib.nic.in వెబ్ సైట్ నుండి కావాల్సిన సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకుని పత్రికా సమాచార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

వృత్తిలో ఉన్న జర్నలిస్టులు నిరంతరం పరిశోధనలు చేస్తూ ప్రజల జీవితాలను మార్చే విధంగా కధనాలు ప్రచురించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ కోరారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి జర్నలిస్టులు కృషి చేయాలన్నారు.

అపోహలు, వదంతుల వ్యాప్తి విషయం లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి దిన పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సోమశేఖర్, రాకా సుధాకర్, పి.ఐ.బి డిప్యూటీ డైరెక్టర్ పి.రత్నాకర్ పలువురు జర్నలిస్టులు, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే వ్యవసాయ బిల్లు

Satyam NEWS

మై స్టోరీ:నా భర్తను నాకన్నతల్లే పెళ్లాడితే యువతీ ఆవేదన

Satyam NEWS

ఏపీ రాజకీయాల్లో జగన్ విష సంస్కృతి మొదలుపెట్టాడు

Satyam NEWS

Leave a Comment