కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలానికి చెందిన 54మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆడపడుచుల కుటుంబాలకు ఆదుకునేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా, రైతు బంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్ ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం పథకం ఏ రాష్ట్రంలో లేదన్నారు. లబ్ధి పొందుతున్న కుటుంబాలు కెసిఆర్ కు ప్రత్యేక అభినందనలు తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, వైస్ఎంపిపి రాజు పటేల్ పాల్గొన్నారు.
వారితో బాటు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, పార్టీ అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, తహశీల్దార్ వెంకటరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ఎంపీటీసీల పోరం అధ్యక్షులు సిద్ధిరాములు, కోప్షన్ సభ్యులు జావిద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా సీనియర్ సహాయకులు రాచప్పతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.