30.7 C
Hyderabad
April 19, 2024 09: 02 AM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ బాధితుల ఆకలి తీరుస్తున్నఎన్టీఆర్ అభిమానులు

Alampur food packets

దేశంలో కరోన నివారణకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి కట్టుబడి బార్డర్ ఏరియాలలో వేలాది లారీలు, ఇతర వాహనాలు ఆగిపోయాయి. అయితే చాలా మంది డ్రైవర్లు, క్లినర్లు ఆకలితో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న జూ. ఎన్టీఆర్ అభిమాన సంఘం చెన్నిపాడు గ్రామ యూవకులు గురుప్రసాద్, శివ, నాగార్జున,  రంగస్వామి (డాన్), బ్రహ్మన్న, వంశీ, షాకిర్, సుబ్బారాయుడు, మధునాయుడు, పురోషోత్తం, సురేష్, హరీష్, వెంకటేష్, శేఖర్, సర్పంచ్ వెంకటమ్మ, చిన్నయిలు తదితరులంతా కలిసి పులిహోర తయారు చేశారు.

ఇలా తయారు చేసిన సుమారు 400 ప్యాకెట్ల పులిహోర పంపిణీ చేశారు. బార్డర్ ఏరియా లో నిలిచి ఉన్న వాహన డ్రైవర్లకు, క్లినర్లకు ప్యాకెట్లు అందచేశారు. ఆలంపూర్ సీఐ వెంకట్రామయ్య చేతుల మీదుగా పులిహోర ప్యాకెట్లు అందజేసి ఆదరాభిమానాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల దొరకని పరిస్థితి ఏర్పడింది. అయిన కూడా ముందుకొచ్చి ఆకలి తీర్చుతున్నారంటే  ఎన్టీఆర్ అభిమానులు నిజంగా గ్రేట్ అని కొనియాడారు.

Related posts

రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎంపి ఉత్తమ్ కు సన్మానం

Satyam NEWS

దేశ రైతుల మేలు కోసమే నూతన చట్టాలు

Satyam NEWS

హంస వాహనంపై కొలువుదీరిన ఆది దంపతులు

Satyam NEWS

Leave a Comment