27.7 C
Hyderabad
April 25, 2024 09: 05 AM
Slider మహబూబ్ నగర్

పార్టీ మారేందుకు జూపల్లి మరో అడుగు ముందుకు?

#JupalliKrishnaRao

ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారడానికి ఒక స్టాండ్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే కొల్లాపూర్ నియోజకవర్గంలో మండల సమావేశాలు ఏర్పాటు చేశారు. తన అనుచరులతో అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు.ఓ వ రాల్ గా అందరూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పినా కానీ బీజేపీ పార్టీకి పోతే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. మరోవైపు నిర్ణయం తీసుకుంటే తర్వాత వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండవదు. అందరి లాగా మనం కూడా క్యారెక్టర్ పోగొట్టుకోకూడదని , రాజకీయ విలువలు కోల్పోకూడదని జూపల్లి అనుచరులకు సమాధానం చెబుతూ వస్తున్నారు.రాజకీయంలో ఆత్మగౌరవ విలువలు ముఖ్యం, వాటిని ఎప్పుడు కోల్పోకూడదని ఆయన చెబుతున్నారు. అయితే అన్ని దారులు మనకు తెరిచే ఉన్నాయి.

ఎవరు అధైర్య పడవద్దు అంటున్నారు.సరైన సమయంలో అందరినీ కలుపుకపోయ్యే విధంగా నిర్ణయం తీసుకుంటా అని అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలతో భవిష్యత్తు ఆగం చేసుకోవద్దని కూడా చెబుతున్నారు.కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలకు, అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని ఇన్ని రోజులు ఈ మాటలు చెబుతూ వస్తున్నారు.

మరో అడుగు ముందుకు వేసిన జూపల్లి

ఇప్పటికే మండల నాయకులతో సమావేశం అయిన జూపల్లి. ప్రస్తుతం మరో వేరే నియోజకవర్గం లో తన అనుచరులతో భేటీ కాబోతున్నారు.బుదవారం అచ్చంపేట ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు.ఇందులో ముఖ్యఅనుచరులతో కీలక నిర్ణయాలపై చర్చించే అంశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాజకీయం పార్టీ ఏది అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఓ కాడికి బీజేపీ అయితేనే బాగుంటుంది అన్నది ఒకవైపు ఉంటే.

మరోవైపు అల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ నుండి రంగంలోకి దిగవచ్చు అన్నది సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అధిష్టానం సంప్రదింపులు చేశారనే చర్చ గూడ నడుస్తుంది. ఒకవేళ జూపల్లి పార్టీ నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బనే అని చెప్పవచ్చు. పార్టీ మారే నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా జూపల్లి తో పాటు కొందరు ముఖ్య నేతలు అందరూ కలిసి ఒక స్టాండ్ తీసుకోబుతున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో కొనసాగితే ఆయన ఓటమి తప్పదని ప్రజలు అంటున్నారు.మొన్నటిదాకా ఆయన అనుచరులపై ఎన్నో అక్రమ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ముఖ్య అనుచరులు జైలుకు వెళ్లారు. దీనితో టిఆర్ఎస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత అనుచరుల్లో మొదలైంది. జూపల్లికి జరిగిన అవమానాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు.పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు. దీనితో ఆయన ఏ పార్టీ నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

జూపల్లి అంటే సింహం అనే మాటలు ఎక్కువ

మొత్తానికి జూపల్లి అంటే సింహం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తు నుండి అధిక సీట్లలో గెలిచారు. గత 2018 ఎన్నికల్లో మున్సిపల్ లో 3500 ఓట్లు మైనస్ వచ్చాయి.ఏడాది నరలోనే ఆయన ఏకంగా మున్సిపాలిటీ లో 11కౌన్సిల్ స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ కన్నా అధిక సీట్లు గెలిచి చూపించిన సంగతి తెలిసిందే. ఇక జూపల్లి టిఆర్ఎస్ పార్టీని వీడితే ఆయనతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కదలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related posts

చేజర్ల మంచినీటి సమస్యకు ఎత్తి పోతల పరిష్కారం

Bhavani

అనితా రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డు

Bhavani

కబడ్డీ పోటీల నిర్వహణ ప్రమాద ఘటనపై కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment