36.2 C
Hyderabad
April 25, 2024 19: 52 PM
Slider ముఖ్యంశాలు

నిమ్స్ లో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ వాసులను పరామర్శించిన జూపల్లి

#jupally

హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో వివిధ కారణాలతో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు, చిన్నంబావి మండలాలకు చెందిన కొందరు వివిధ అనారోగ్య కారణాలతో, ప్రమాదంలో క్షతగాత్రులు అయి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నంబావి మండల పరిధిలోని పెద్దదగడ గ్రామానికి చెందిన కనమోని గంగదారి గత కొన్ని నెలలుగా కడుపులో గడ్డ అయ్యి నొప్పితో బాధపడుతున్న నేపధ్యంలో మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో గత 10 రోజుల క్రితం చేరడం జరిగింది.

ఆఫరేషన్ నిమిత్తం జూపల్లి చొరవతో సీఎం సహాయనిది నుంచి 2.50000 (రెండు లక్షల యాభై వేలు) రూపాయల LOC ని మంజూరు చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా జూపల్లి ఆయనను పరామర్శించారు. కోడేరు మండల పరిధిలోని రేమద్దుల గ్రామానికి రాముడు, లలిత బార్య భర్తలిద్దరు కలిసి గ్రామంనుంచి గోపాల్ పేట సంత నిమిత్తం ఆటోల వెళ్తున్న గ్రామంలో అదుపుతప్పి చెట్టుకు డి కొట్టడంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలైనారు. మెరుగైన చికిత్స కోసం వారిని నిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న జూపల్లి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుంచి సహకారం అందేలా కృషి చేస్తానని భరోసానిచ్చారు. అదే విధంగా కోడెరు మండల పరిధిలోని ఎత్తం గ్రామానికి చెందిన చక్కెర్ల లక్ష్మయ్య పొలం పనులు నిమిత్తం వెళ్తున్న క్రమంలో పాము కాటుకు గురైనాడు. చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరడంతో వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని జూపల్లి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయా బాధితులను పరామర్శించిన జూపల్లి గారు అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు.వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ పరంగా సహకారం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

పరిమితికి మించిన అప్పులు: ఏపికి ఇక తిప్పలు

Satyam NEWS

విజయనగరం పైడితల్లి ఆలయ విస్తరణ కు తొలగిన అడ్డంకులు

Bhavani

పండుగలా కొనసాగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

Leave a Comment