28.7 C
Hyderabad
April 20, 2024 03: 39 AM
Slider మహబూబ్ నగర్

మాజీ మంత్రి జూపల్లి పార్టీ మార్పునకు రంగం సిద్ధం

మాజీ మంత్రి తోపాటు మరి కొంత మంది ఉద్యమ నేతలు కూడా గుడ్ బై

ఉమ్మడి పాలమూరు జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు మొదలైనట్లు కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ నేతలు పార్టీ విడుతున్నరనే విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెల్లినట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉద్యమాన్ని చేపట్టి, పాదయాత్ర చేసిన నేటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత కొన్ని రోజుల క్రితం కెసిఆర్ కు కొన్ని అంశాలను మీడియా ద్వారా తెలియజేశారు.ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలోకి వలస వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అభివృద్ధిని మరచి పోలీస్ లతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.ఎమ్మెల్యే ను మెప్పించడానికి కొందరు ఎస్సైలు ప్రశ్నించిన వారిపై, తన అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి జూపల్లి చెప్పారు.

దీనిపై గతంలోనే డీజీపి నుంచి స్థానిక సీఐ వరకు ఫిర్యాదు చేసిన ఫలితం రాలేదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర మంత్రుల దృష్టికి,ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన చర్యలు తీసుకోలేదు.ఇకపై పార్టీలో ఉంటూ ప్రేక్షక పాత్ర వహించలేనని ఆయన అన్నారు.పోలీసుల తీరుపై నియోజకవర్గంలో విజయదశమి తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. విజయదశమి వరకు గడువు ఇచ్చారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.తన అనుచర వర్గం, ఉద్యమ నాయకులకు అన్యాయం జరుగుతుంటే పార్టీలో చూస్తూ ఉండలేనని ఆయన అంటున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే ఇక తగిన పరిణామాలను చూడాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వానికి గత కొన్ని రోజుల క్రితం అల్టిమేటం జారీ చేశారు.

ఇక జూపల్లి పార్టీ మార్పు కు సిద్ధం?

తన అనుచరులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమ కేసులు, పోలీసుల దాడులను ఇకపై చూస్తూ ఉండలేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు.సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయిన ఆయనలో చలనం రావడం లేదని మాజీ మంత్రి జూపల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక పార్టీ మార్పుకై ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది.ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి నేతలు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది.

జూపల్లి నిర్ణయం మునుగోడు ఉప ఎన్నికల తర్వాత?

పిలుపులు వస్తున్న జూపల్లి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు.ఆయన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే ఏ పార్టీకి వెళుతున్నారనేది స్పష్టత రాలేదు. మొత్తానికి పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.అటు మునుగోడు ఉప ఎన్నికల ముందే జూపల్లి ఈ నిర్ణయం తీసుకోబోతున్నడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై ఆ ప్రభావం పడేవిధంగా కనిపిస్తుంది.మొత్తానికి జూపల్లి మునుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ మారే ఆలోచనలు పుష్కలంగా ఉన్నాట్లు కనిపిస్తుంది.

ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనాలు మొదలైనట్టే. ఆయన ఒక నియోజకవర్గం, జిల్లా ప్రాంతానికి సంబంధించిన నాయకుడైతే కాదు. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా సంబంధాలున్నాయి.దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కదలికలు రావచ్చని చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి పోతే బాగుంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే జూపల్లి అంటే సింహం అని కూడా అంటున్నారు. మరి బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలోకి తెలంగాణను వ్యతిరేకిచ్చిన వాళ్ళు రావడం, ఉద్యమ నాయకులను అణిచివేయడంతో జూపల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ఆయనతో పాటు చాలామంది ఉద్యమ నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.జూపల్లి పై పాలకుల సాధింపులకు కొన్ని అక్రమ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేటీఆర్ బుజ్జగింపులు చేసిన సంగతి కూడా తెలిసిందే. మరి మాజీ మంత్రి జూపల్లి పార్టీ మారే అంశంపై కెసిఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారా చూడాలి.ఇప్పుడు జూపల్లి పార్టీ మారే నిర్ణయం నియోజకవర్గ ఆయా పార్టీల ఆశావాహుల పరిస్థితి ప్రశ్నగా మారింది.

Related posts

అనూహ్యంగా ఆర్ధిక శాఖ నుంచి ముగ్గురి సస్పెన్షన్

Satyam NEWS

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Sub Editor

శారదా పీఠంలో విష జ్వరపీడ హర, అమృత పాశుపత యాగం

Satyam NEWS

Leave a Comment