31.2 C
Hyderabad
April 19, 2024 06: 38 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో మరొక్క సారి జూపల్లి ప్రభంజనం

#JupallyKrishnarao

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెల్పుతూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వందలాది ట్రాక్టర్ల తో కొల్లాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

 ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి కొల్లాపూర్ ప్రధాన వీధుల గుండా జరిగిన భారీ ఉరేగింపులో రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ ట్రాక్టర్ ల ర్యాలీ సుమారు ఏడు కిలోమీటర్ల మేర కొనసాగింది. నియోజకవర్గ వ్యాపితంగా వివిధ గ్రామాల నుంచి మద్దతు తెలపడానికి ట్రాక్టర్ లతో వచ్చిన రైతులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్ పై తిరుగుతూ కొన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వారిని ఆప్యాయంగా పలకరించారు.

ట్రక్టర్ ర్యాలీలో కరోనా నిబంధనలు పాటిస్తూ స్వయంగా మాజీ మంత్రి జూపల్లి ప్రారంభం నుంచి ర్యాలీ చివరి వరకు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను రైతులను ఉత్సాహ పరిచారు. కొల్లాపూర్ పట్టణంలోని అమరవీరుల స్థూపం కు తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ, అంబెడ్కర్ కి పూలమాల వేసి నివాళి అర్పించారు.

కొల్లాపూర్ పట్టణ NTR చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అక్కడే ట్రాక్టర్ పై నిల్చొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఎవరు కష్టాల పాలు కావొద్దని కేసీఆర్ ఉద్దేశ్యమని అన్నారు.

సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ఒక్కోక్క సమస్యను దశలవారీగా పరిష్కరించే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని జూపల్లి అన్నారు.

ఊహించని సాహసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

అందులో భాగంగానే ఆనాటి బ్రిటిష్ పాలన నిజాం పరిపాలన కావొచ్చు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల కాలం నుంచి రైతాంగం తాత ముత్తతలనుంచి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పేర నమోదుకావడానికి వర్ణనాతీతమైన కష్టాలు అవస్థలు పడుతున్న దశలో ఎవరు ఊహించని చేయని సహాసాన్ని చేశారని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్ చేసి అందరికి ఆమోదయోగ్యమైన  నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకవరడం రైతాంగం ఎంతో హర్షించదగ్గ పరిణామం అని జూపల్లి పునరుద్ఘాటించారు. ఒకప్పుడు కొల్లాపూర్ అంటే కోన్ పుస్తె కొల్లాపూర్ అనేవారు ఆనాడు త్రాగడానికి నీరు లేని పరిస్థితి తట్టనెత్తిన పెట్టుకొని బిడ్డ సంకనేసుకొని వలసలు వెళ్లే పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు.

యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ నాయకత్వంలో సంఘటిత శక్తిగా చేసి ఉద్యమం నడిపితే ఆ ఉద్యమంలో అందరం కూడా పాలుపంచుకున్నాం కాబట్టే ఆ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీలో అతి స్వల్పకాల వ్యవధి సమయంలో భారీ ఎత్తున తరలివచ్చిన రైతులకు కార్యకర్తలకు జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వర్గానికి చెందిన వివిధ మండలాల ఎంపీపీ ప్రతాప్ గౌడ్,కొండ రాధ , జెడ్పీటీసీలు జూపల్లి భాగ్యమ, సర్పంచ్ లు కొల్లాపూర్  కౌన్సిలర్స్ షేక్ రహీం పాషా,నయీమ్, మేకల శిరీష కిరణ్ యాదవ్,బోరెల్లి కరుణ మహేష్, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు,ధర్మ తేజ,

సింగిల్ విండో డైరెక్టర్లు పసుపుల నరసింహ్మ, రఘుపతి రావు తదితర ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, అనుచరులు వంగ రాజశేఖర్ గౌడ్, మేకల కిషోర్ యాదవ్, ఆర్మీ జవాన్ రమేష్ ముదిరాజ్, కృష్ణమ నాయుడు, ప్రసాద్,పశుల వెంకటేష్,దిలీప్ విజయ్ ,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు  తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

ఘనంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

Leave a Comment