27.7 C
Hyderabad
April 25, 2024 10: 06 AM
Slider మహబూబ్ నగర్

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

#Jurala Project Gates

ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో జూరాల ప్రాజెక్ట్ గేట్లను అధికారులు ఎత్తేశారు. మొత్తం ఐదు గేట్లు ఎత్తారు. దాంతో కృష్ణమ్మ వడి వడిగా శ్రీశైలానికి పరుగులు తీస్తున్నది. రెండు గేట్లు రెండు మీటర్లు, మూడు గేట్లు ఒక మీటర్ తెరచి దిగువకు నీటిని వదులుతున్నారు.

ఎగువ రాష్ట్రాలలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతున్నది. దాంతో నారాయణ పుర జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.

అక్కడ నుంచి జూరాలకు వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల గేట్లు ఎత్తడంతో కృష్ణా నది శ్రీశైలం ప్రాజెక్టు వైపునకు వెళుతున్నది. స్పిల్ వే ద్వారా కూడా 26759 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి అధికారులు వదులుతున్నారు.

Related posts

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Murali Krishna

రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం?

Satyam NEWS

నిత్యావసర వస్తువుల నియంత్రణ లో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment