39.2 C
Hyderabad
April 25, 2024 17: 27 PM
Slider వరంగల్

స్త్రీల విద్య కోసం పాటుపడ్డ మహనీయుడు జ్యోతిబాపూలే

#Mahatma Jyotibapoole

స్త్రీల విద్య కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిబాపూలే ఎంతో పాటు పడ్డారని ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ శాఖ భవనంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన “మహాత్మా జ్యోతిబాపూలే” 196వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ YV గణేష్, జిల్లా వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి జిల్లా అధికారులు,BC సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరి క గోవింద్ నాయక్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వెనుకబడిన కుటుంబంలో జన్మించిన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి చిరు వ్యాపారి పేద కుటుంబంలో జన్మించడంతో బాల్యం నుంచి అనేక రకాలుగా కష్టాలు పడినారు అని అన్నారు. 1840 సం లో సావిత్రిబాయి పూలతో వివాహం జరిగినది మహాత్మ జ్యోతిబాపూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి స్త్రీల విద్య కోసం యువ వితంతువు మహిళల కోసం సమాజంలో వారు కూడా అందరితో సమానంగా బ్రతకాలని ఎంతో కృషి చేశారు.1851 సం లో బాలికల చదువుకోసమని మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను స్థాపించినారు అంతేకాకుండా స్త్రీలు కూడా అలాంటి సమాజంలో పురుషులవులే కాకుండా వివక్షను ఎదుర్కొనే సమయంలో స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేశారు.

సమానత్వాన్ని ప్రోత్సహించి సంస్కరణంగా పునర్నిర్మాణ కోసం మాత్రమేనని 1873 సం లో సత్యశోధక్ అనే సంస్థను స్థాపించి ఆనాడు సమాజంలో ఉన్న సమానత్వం కోసం అంటరానితనాన్ని, కులవ్యక్షతను నిర్మూలన ధ్యేయంగా పనిచేశారు అంటరాని వారిని పరిగణించబడే ప్రజలందరికీ వర్తింపజేసే విధంగా “దళితుల” అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించారు అని అన్నారు.1890 సం లో మహాత్మ జ్యోతిబాపూలే కన్నుమూశారు అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇంతటి మహనీయుని 196వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఘనంగా నిర్వహించడం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కాకుండా బాబు జగ్జీవన్ రావు, మరియు అంబేద్కర్ ఇంకా ఎందరో మహానీయులు జీవిత చరిత్రలను వారి త్యాగాలను రాబోయే భావితరాలకు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరు మహనీయుల వర్ధంతిలను జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంఘాలను అధికారులను సమన్వయం చేసుకుంటూ ఘనంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఆ మహనీయుల మీద ఉన్నటువంటి ఆకాంక్షను రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ దేశ ప్రజలకు కూడా తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో చేస్తుంది అని ఆన్నారు.

ఈ సమావేశానికి BC సంఘం కన్వీనర్ మురళీ కృష్ణ, పిసా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్,BC జాతీయ అదికార ప్రతినిధి దోడ్డ పెళ్లి రఘుపతి, నిమ్మల కిష్టయ్య,గొల్ల పెళ్లి రాజేందర్,కంద కట్ల సారయ్య,ముంజాల బిక్షపతి,మురళి,గుగ్గిల సాగర్, మాటురి ఏడుకొండల్ మరియు వివిధ సంఘాల నాయకులు,అధికారులు, పాల్గొన్నారు

Related posts

సంక్రాంతిలోకా మేడారం జాతర పనులన్నీ పూర్తి చేయాలి

Satyam NEWS

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలీసులు

Murali Krishna

1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం

Satyam NEWS

Leave a Comment