36.2 C
Hyderabad
April 24, 2024 19: 24 PM
Slider సంపాదకీయం

రఘురాముడిపై పాల్ ను ప్రయోగించింది ఎవరు?

#K A Pail

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతంపైనా హిందూ దేవాలయాల పైనా హిందూ మతవాదులపైనా ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతోందా అన్న అనుమానం రేకెత్తుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భూముల వేలం ప్రతిపాదించడాన్ని అడ్డుకున్న వారిని అణచివేసే క్రమం నుంచి తాజా పరిణామాల వరకూ జరుగుతున్న సంఘటనలు ఈ అనుమానం బలపరుస్తున్నాయి.

తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రచురించే సప్తగిరి మాగజైన్ తో బాటు క్రైస్తవ సమాచార పుస్తకం కొందరు చందాదారులకు చేరడం, దాన్ని ప్రసార మాధ్యమాలలో రాకుండా చేయడం వరకూ నిరంకుశంగా ప్రవర్తిస్తున్న కొందరు వ్యక్తులు చేస్తున్న పనులు చూస్తుంటే క్రైస్తవ మత వ్యాప్తికి ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.

శ్రీవారి భూముల వేలం విషయంపై రగడ

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భూముల వేలం విషయంపై మొదటగా గొంతు ఎత్తిన వ్యక్తి అధికార పార్టీకి చెందిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణం రాజు.  శ్రీవారి ఆస్తుల విక్రయంపై ఆయన అప్పటిలోనే మాట్లాడుతూ తాను శ్రీవారి భక్తుడినని ఆయన ఆస్తుల పరిరక్షణకు తాను ఎంత వరకైనా పోరాటం చేస్తానని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం రాకపోవడవల్ల, కరోనా పరిస్థితిలో హైదరాబాద్ నుంచి కదల లేకపోవడం వల్ల రఘురామకృష్ణంరాజు ప్రసార మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలు వెల్లడించారు.

పాల్ ప్రకటన దేనికి సంకేతం?

తర్వాత పలు సంస్థలు, వ్యక్తులు కూడా శ్రీవారి భూముల వేలంపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు అధికార పార్టీలో ఉండి కూడా బహిరంగంగా అంతకన్నా ఎక్కువ ధైర్యంతో మాట్లాడారు.

ఇది క్రైస్తవ మతాభిమానులకు కంటగింపు కలిగించిందా అన్న అనుమానం నిన్నటి కె ఏ పాల్ ప్రకటనలతో కలుగుతున్నది. సినిమా విషయాలకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన పాల్ జాతీయ అంతర్జాతీయ విషయాలతో బాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి కూడా మాట్లాడారు.

నేను శాపం పెడితే పదవి గోవిందా

కరోనా వ్యాప్తి అరికట్టడం గురించి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తనను నమ్ముకుంటే ఈ పాటికే కరోనా కట్టడి అయిపోయేదని కూడా చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాప్తికి ప్రధాన కారకుడు అనే విధంగా కూడా పాల్ మాట్లాడారు. ఇలాంటి జాతీయ విషయాలు మాట్లాడుతూ హటాత్తుగా నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిని తప్పు పట్టారు.

దైవాంశ సంభూతుడినైన తాను శాపం పెట్టడం వల్లే రఘురామకృష్ణంరాజు పదవులు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నర్సాపురం లోక్ సభ ఎన్నికలలో కే ఏ పాల్ స్వతంత్ర అభ్యర్ధిగా ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేశారు.

రఘు రామకృష్ణంరాజు చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు కూడా. అసలు నర్సాపురం నియోజకవర్గం నుంచి కే ఏ పాల్ పోటీ చేయడం వెనుకే ఎవరైనా అదృశ్య శక్తుల ప్రోత్సాహం, ప్రేరణ ఉందేమో అనే అనుమానం కూడా ఇప్పుడు కలుగుతోంది. అయితే కే ఏ పాల్ కు లోక్ సభ ఎన్నికలలో వచ్చిన ఓట్లు కేవలం 3 వేలు మాత్రమే.

మత మార్పిడులపై నోరు విప్పినందునే..

ఇప్పుడు హఠాత్తుగా అమెరికా నుంచి యూ ట్యూబ్ లో ప్రత్యక్షమై రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిపై ప్రశ్నించడం చూస్తే హిందూవాదంపై సరికొత్త దాడిగానే కనిపిస్తున్నది. ఇద్దరికి మధ్య వ్యక్తిగత వైరం కానీ సిద్ధాంత పరమైన విభేదాలు కానీ లేవు. మే 28న ఒక జాతీయ ఛానెల్ మతమార్పిడుల గురించి నిర్వహించిన ఒక వేదికపై రఘురామకృష్ణంరాజు చేసిన ప్రస్తావన దేశంలోనే ఒక సంచలనం కలిగించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా సంచలనం కలిగించింది. దీనికి తోడు ఆ మరుసటి రోజు టైమ్స్ నౌ ప్రత్యేకంగా నిర్వహించిన డిబేట్ లో కర్నాటక లోని మణిపాల్ సంస్థకు చెందిన మోహన్ దాస్ పాయి తో కలిసి సుధీర్ఘ చర్చలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు మత మార్పిడుల నిరోధానికి చట్టాలు రూపొందించే ఆవశ్యకతను కూడా చెప్పారు.

తాను హిందూత్వం గురించి, జరుగుతున్న మత మార్పిడుల గురించి తన పార్టీ పైన ప్రభుత్వం పైన వత్తిడి తెస్తానని కూడా ఆయన ప్రకటించారు. అప్పటి నుంచే క్రైస్తవ సంస్థలకు, వ్యక్తులకు రఘురామకృష్ణంరాజు టార్గెట్ గా మారారు. ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నవారే హిందూ వాదాన్ని పట్టుకున్న రఘురామకృష్ణంరాజుపై మాటల దాడికి దిగారా అన్న అనుమానం కలుగుతోంది.

పాల్ ప్రకటనతో ఏం ఆశిస్తున్నారు?

దీనికి సరికొత్తగా పాల్ వీడియో సందేశం బలం చేకూరుస్తున్నది. మత మార్పిడుల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు రఘురామకృష్ణంరాజు ప్రస్తావించిన అంశాలపై కంటగింపుతో ఉన్న కొన్ని వర్గాలు పాల్ వీడియో సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి.

హిందూత్వం గురించి హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తానని చెప్పిన రఘురామకృష్ణం రాజుకు సొంత పార్టీ నుంచే రాజకీయ ప్రతిఘటన ప్రారంభం అయింది కూడా. దానికి ఇప్పుడు పాల్ జతకూడటం పలు అనుమానాలు తావిస్తున్నది. పాల్ ను ప్రయోగించిన వారు ఏమి ఆశిస్తున్నారో విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది.

Related posts

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు

Satyam NEWS

తెరుచుకున్న అయ్యప్ప ఆలయం

Murali Krishna

నిత్యావసరాలు పంచిపెట్టిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS

Leave a Comment