28.7 C
Hyderabad
April 20, 2024 07: 49 AM
Slider క్రీడలు

విజయనగరం సెంట్రల్ అధ్వర్యం లో క‌బ‌డ్డీ పోటీలు….!

#vijayanagaram

విజ‌య‌న‌గ‌రం లో  స్థానిక ఎం ఆర్  స్టేడియం లో విద్యార్థిని విద్యార్ధులకి కబడ్డీ  పోటీలు ప్రారంభం అయ్యాయి. రోట‌రీ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో న‌వ‌త‌రోత్సవం 2022 నేప‌ధ్యంలో 250 మంది కి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో ప్రోగ్రాం చైర్మన్లు అబ్దుల్,  ఆదిత్య,  భాను జగన్నాద్  , శ్యాం సుందర్ ల  ఆధ్వర్యం లో యూత్ మొంత్ డైరెక్టర్ కే.ఆర్.కే రాజు…   చైర్మన్ అశోక్ మాలు ప్రారంభించారు.

అధ్యక్షుడు కృష్ణ గోపాల్ అగర్వాల్ కార్యదర్శి మనోజ్ కొల్ల క్ల‌బ్ సర్వీస్ శంకర్ రెడ్డి టర్న్ మూర్తి  పీయూష్ అగర్వాల్ తదితరులు ప్రసంగించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి  దేహ దారుఢ్యానికి  ఏకాగ్రత పెంచుకోవటానికి  పోటీ తత్వాన్ని ప్రదర్శించటానికి దోహద పడతాయని వక్తలు అన్నారు  ఈ కార్యక్రమం లో సభ్యులు జయ కృష్ణ చందక అశోక్ , బాలి సాయి  తదితరులు పాల్గొన్నారు.

ఇన్న‌ర్ వీర్ క్ల‌బ్  ఆధ్వ‌ర్యంలో కుక్కింగ్ పోటీలు

అలాగే  రోజు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తం గా నిర్వహించిన కుకింగ్ పోటీలు ఎస్.వీ.ఎన్ లేక్ పాలస్ లో జరిగాయి . క్లబ్ అధ్యక్షులు కృష్ణ గోపాల్ అగర్వాల్ ,కార్యదర్శి కొల్లా మనోజ్ మాట్లాడుతో నెల రోజుల పాటు జరిగే ఈ పోటీ లలో విద్యార్థు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు

యూత్ సర్వీస్ డైరెక్టరు కే.ఆర్.కే రాజు చైర్మన్ అశోక్ మాలు మాట్లాడుతో కుకింగ్ పోటీలు వలన మహిళలో ఉన్న వంట వార్పూ అభిరుచులు మరియు ప్రతిభా పాటవాలు నిరూపించుకునే మంచి వేదిక ను రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అందిస్తుంది అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో   ప్రొగ్రమ్ చైర్మన్ అస్మా బాను ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ లతా సెక్రటరీ శిరీష సభ్యులు శ్వేతా పుష్కల తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్య‌క్ర‌మంలో సభ్యులు టీఎల్ఎన్ మూర్తి శంకర్ రెడ్డి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్టోబ‌ర్ 9 నుంచి 11 వ‌ర‌కు విజయనగరం ఉత్సవాలు

Satyam NEWS

దళితులను హింసిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

ఇద్దరు స్నేహితుల కోసం రైతులకు అన్యాయం చేస్తున్న మోడీ

Satyam NEWS

Leave a Comment