స్టేషన్ ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ గ్రామంలో నమిలిగొండ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డా.టి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంగళ హారతులతో, కోలాటల నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య క్రీడా జ్యోతి వెలిగించి, క్రీడా జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి సుమారుగా 50 టీమ్స్ వచ్చాయని, 400 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్స్ లో పాల్గొన్నారని, క్రీడాకారులను అతిథులుగా గౌరవించి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రో కబడ్డీ ద్వార కబడ్డిపై మంచి పాపులారిటీ వచ్చిందని, కబడ్డీ క్రీడ గ్రామీణ స్థాయి నుండి ప్రపంచ స్థాయి వరకు ప్రజలలో ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు.
ఈ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ. పన్నెండు వేలు, రెండవ బహుమతి రూ.పది వేలు, మూడవ బహుమతి రూ. ఎనమిది వేలు, నాల్గవ బాహుమతి రూ. ఆరు వేలు, ఐదవ బహుమతి రూ. నాలుగు వేలు, బహుమతి రూ. రెండు వేలు నిర్వహకులు అందజేస్తారని, బహుమతులు అనేవి ప్రోత్సహించడానికి మాత్రమేనని ఆయన అన్నారు. గెలుపు మీలో ఉన్న ప్రతిభకు నిదర్శనమని, ఓటమి గెలుపుకు నాంది అని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మారపాక రవి జడ్పీటీసీ & SWSC చైర్మన్ కందుల రేఖగట్టయ్య, ఎంపీపీ ఆకినేపల్లి బాలరాజు, ఉప్పస్వామి సర్పంచ్, రజాక్ ఎంపీటీసీ ఆగరెడ్డి, జింక భిక్షపతి, ప్రభకర్, ఇల్లందుల శ్రీనివాస్, గట్టు రమేష్ పిఏసీఎస్, పి రంజిత్ రెడ్డి, తోట వెంకన్న, మారపల్లి ప్రసాద్ బాబు, గుండె మల్లేష్, నర్సింగం, పిఇటి ఉపాధ్యాయులు, క్రీడాకారులు ,గ్రామ నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.