ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను బీజేపీ కార్యాలయంలో కలిసి పలు విషయాలు చర్చించారు. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అంతకుముందు ఆదినారాయణరెడ్డి వైఎస్ఆర్‌సీపీ లో ఉంటేవాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆదినారాయణరెడ్డి జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
previous post
next post