28.7 C
Hyderabad
April 25, 2024 06: 55 AM
Slider కడప

సీబీఐ అధికారిపైనే కేసు పెట్టిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

#kadapapolice

ఒక హత్య కేసును పరిశోధించే పోలీసు అధికారిపై కేసులు పెట్టవచ్చా? ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దర్యాప్తు అధికారులపైనే కేసులు పెడుతుంటారు. వైయస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కేసు నమోదైంది. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారని కడప కోర్టులో ఉదయ్ కుమార్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ తనని వేధిస్తుందంటూ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీని ఫిబ్రవరి 15న కలిశారు. ఈ మేరకు సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవట్లేదని.. వాళ్లు చెప్పినట్లు వినాలని వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రస్తావించారు.

Related posts

వెరైటీ: అన్ని జిల్లాల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్

Satyam NEWS

చొచ్చుకువచ్చిన చైనా ఇప్పుడు గగ్గోలు పెడుతోంది

Satyam NEWS

క్రీడాకారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment