37.2 C
Hyderabad
March 29, 2024 17: 41 PM
Slider కడప

కరోనా పేషంట్లకు కడప పోలీసుల సహాయం

kadapa police

కడప జిల్లా పోలీసులు బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోవిడ్ 19 లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే వారందరికి రోజు వారీ అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులను అందచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కడప నగర శివారులోని ఫాతిమా మెడికల్ కళాశాలలో  జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు సహాయక కేంద్రం ప్రారంభించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు  అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

కడప డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సహాయక కేంద్రం ఏర్పాటు అయింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు పోలీసులు అండగా ఉంటారని కడప పోలీసులు చాటి చెబుతున్నారు. బకెట్స్, సోప్స్, స్యానిటైజర్లు, టవల్స్, ఇతర 22 రకాల వస్తువులను పోలీసులు కరోనా పేషంట్లకు ఇస్తారు.

Related posts

క్రిస్మస్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలి

Satyam NEWS

మృతుడి కుటుంబానికి పరామర్శ

Satyam NEWS

దొరల పార్టీకి కామ్రేడ్లు మద్దతా?

Satyam NEWS

Leave a Comment