40.2 C
Hyderabad
April 19, 2024 16: 22 PM
Slider కడప

కోవిడ్ మృతులకు వెంటనే పరిహారం చెల్లించాలి

#Kadapa TDP

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా రాజంపేటలో టీడీపీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం ర్యాలీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి రాజంపేట ఇంచార్జ్ బత్యాల చెంగల రాయుడు పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ ఆదేశాల మేరకు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కరోనా తో మృతి చెందిన మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్ధికసహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆక్సిజన్ కొరతతో మరణించిన మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించాలన్నారు.

జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లకి, భవన నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు, వృత్తిదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందచేయలన్నారు.

రైతుల వద్ద నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం రూ. 5 వేల సాయం అందించి వారి కుటుంబాన్ని అదుకోవలన్నారు.

తమ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న జర్నలిస్టులను, ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రకటించి, రూ.50 లక్షల బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అదించాలన్నారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని కోరారు.

భత్యాల చెంగల రాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ మృతులకు పరిహారం చెల్లించకపోతే ,వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని తాము వడ్డీతో సహా చెల్లిస్తామని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ట్టు తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అనసూయమ్మ, అద్దెపల్లె ప్రతాప్ రాజు, బషీర్, సుబ్రహ్మణ్యం నాయుడు, పొలిశివ కుమార్, మందా శ్రీను,ఇడి మడకల కుమార్,సంజీవి నాయుడు,రేవూరి వేణుగోపాల్,జడ శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాగజ్‌నగర్‌లో మావోయిస్టు పోస్టర్ల కలకలం

Sub Editor

ప్రతి రోజూ 20 నిమిషాలు ఎండలో కూర్చోండి

Satyam NEWS

వైసీపీ రెడ్ల డిఎన్ఏ పార్టీ మాత్రమే, దళితులది కాదు

Bhavani

Leave a Comment