27.7 C
Hyderabad
April 20, 2024 00: 26 AM
Slider ప్రత్యేకం

అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లు కనుగొన్న 8వ క్లాస్ స్టూడెంట్

#HomeMinister

అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లను కనుగొన్న 8 వ తరగతి విద్యార్థిని కైవల్యారెడ్డి నేడు హోంమంత్రి సుచరితను కలిశారు.

కైవల్యా రెడ్డి తో పాటు తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి, తమ్ముడు తపస్వి రెడ్డి లు కూడా హోం మంత్రిని కలిశారు.

మార్స్ జూపిటర్ గ్రహాల మధ్యలో ఉన్న ఒక గృహ శకలాన్ని కైవల్యా రెడ్డి కనిపెట్టింది.

స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ అంబాసిడర్ బృందం లో కైవల్యా రెడ్డి తో పాటు తమ్ముడు తపస్వి రెడ్డి సెలెక్ట్ అయి ఈ ఘనత సాధించారు.

దేశ వ్యాప్తంగా ఆస్ట్రోనమి పై నిర్వహించే ప్రచారం తో పాటు ఆంద్రప్రదేశ్ కిడ్స్ క్లబ్ ఫౌండేషన్ తరుపున వీరిద్దరూ విధులు నిర్వహించనున్నారు.

వీటికి సంబంధించిన నియామక పాత్రలను, మెడల్స్ ను హోంమంత్రి సుచరిత కు కైవల్యా రెడ్డి కుటుంబం చూపించారు.

కైవల్యా రెడ్డి తండ్రి స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. ఉద్యోగ రిత్యా పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు పట్టనం లో స్థిరపడ్డారు.

ప్రసుతం నారాయణ టెక్నో స్కూల్ లో కైవల్యారెడ్డి 8 వ తరగతి చదువుతోంది.

భవిష్యత్తు లో మరిన్ని విజయాలు సాధించాలని హోంమంత్రి సుచరిత కైవల్యా ను ఆశీర్వదించారు.

Related posts

శిథిలావస్థకు చేరుకున్న నరసరావుపేట షాదీ ఖానా

Satyam NEWS

ఆయుర్వేదం వైపు అడుగులు!

Bhavani

యాక్ష‌న్ హీరో విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఎనిమీ`

Satyam NEWS

Leave a Comment