22.2 C
Hyderabad
December 10, 2024 10: 54 AM
Slider తూర్పుగోదావరి

విద్యార్ధులకు సమస్యలు సృష్టిస్తే ఊరుకోం

#kakinada

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్  కళాశాల యాజమాన్యాలను హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అన్ని కళాశాలలకు యూఓ నోట్ ను కూడా పంపించామన్నారు.

జిల్లాలోని పలు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుండి.. ఫీజులు చెల్లించాలని ఒత్తిళ్లు తెస్తున్నట్లు, తరగతులకు హాజరు కానీయకుండా,  హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా పరీక్షలకు హాజరయ్యేందుకు ఆటంకం కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందుకునే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలలకు నేరుగా విడుదల చేస్తామని, పాత బకాయిలు కూడా క్రమంగా చెల్లించబడతాయని స్పష్టంగా ప్రకటించిందన్నారు.

ఇప్పటికే.. ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను  ఉల్లంఘించి.. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతపు ఫీజు వసూళ్లకు పాల్పడినా, హాల్ టికెట్లను ఇవ్వకుండా విద్యార్థుల పరీక్షలకు హాజరు కానీయకుండా ఆటంకం కలిగించినా.. సంబంధిత విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి హెచ్చరించారు.

Related posts

నేటితో ముగియనున్న నాగోబా జాతర..

Bhavani

తిరుమల శ్రీవారి హుండీలో డబ్బు చోరీ చేస్తుండగా..

Satyam NEWS

క్రీడాకారులకు ములుగు జెడ్పీ చైర్మన్ ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment