31.2 C
Hyderabad
April 19, 2024 04: 36 AM
Slider తూర్పుగోదావరి

కరోనా సమయంలో కాకినాడ రూరల్ జర్నలిస్టుల సంక్షేమ కమిటీ

#Kakinada Journalists

కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని మేలుకొలుపు తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు దక్కడం లేదంటూ కనీసం ఫ్రంట్లైన్ వారియర్ గా గుర్తించకపోవడం పై జర్నలిస్టులు సేవ కమిటీని ఏర్పాటు చేసుకుని జర్నలిస్టులకు అండగా నిలవాలని కాకినాడ రూరల్ వర్కింగ్ జర్నలిస్టులు తీర్మానించుకున్నారు.

సోమవారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, దినపత్రిక ప్రతినిధులు కలిసి రాబోయే రోజుల్లో ఎదుర్కోవలసిన విపత్కర పరిస్థితులను ఎలా ముందుకు సాగాలని దానిపై సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రతినిధుల సూచనలు సలహాల మేరకు సేవ కమిటీ ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ వర్కింగ్ జర్నలిస్ట్ సేవ కమిటీని ఏర్పాటు చేసి గౌరవ అధ్యక్షులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సలహాదారులుగా పితాని వెంకట రాము, జంగా గగారిన్ సభ్యులుగా పట్నాల ప్రవీణ్, రెడ్డి నాయుడు బాబు, పొట్ట సాయిరాం, సూర్య, దైవ ప్రసన్న బాబు, శ్రీనివాస్, పరమేష్, ఎం వి వి సూర్యనారాయణ, పెంకే చందు, ప్రజాశక్తి ప్రసాద్, దాసరి శ్రీనివాసరావు తదితరులు నియమించారు. జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ లను అందించాలని వినతి పత్రాలను మండల అభివృద్ధి అధికారి పాఠం సత్యనారాయణ మూర్తి కి అందించారు.

సమాజాభివృద్ధికి, అభ్యున్నతికి తోడ్పడుతున్న జర్నలిస్ట్ కుటుంబాలకు త్వరితగతిన కరోనా వ్యాక్సిన్ ను అందించే విధంగా మండలం నుండి ఇ డి ఎం హెచ్ ఓ అధికారి వారికి రాతపూర్వక విజ్ఞప్తి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

కాకినాడ రూరల్ మండలం లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా వచ్చిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు  త్వరితగతిన వైద్యం అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తీర్మానించారు.

Related posts

మంత్రులు ఎమ్మెల్యేలలాగా చేతులు కట్టుకుని నిలబడం

Satyam NEWS

న్యూ రూల్: కామారెడ్డిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం

Satyam NEWS

యువ ముఖ్యమంత్రి కరోనా రోగుల్ని పరామర్శించడం లేదు..ఎందుకో?

Satyam NEWS

Leave a Comment