27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే 35వ సౌత్ జోన్ నేషనల్ స్విమ్మింగ్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి స్విమ్మింగ్ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ఐ.కే. దర్శిల్, ఎం షణ్ముఖ వీర్, ఏం యశస్విని, డి.మణికంఠ నవీన్ ఉన్నారు. వీరు నలుగురు విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్, అసోసియేషన్ కార్యదర్శి ఇరుసుమల్ల రాజు, డి ఎస్ డి ఓ శ్రీనివాసు, కోచ్ అప్పలనాయుడు, ముఖ్య సలహాదారుడు మంగా వెంకటశివ రామకృష్ణ, క్రీడాకారులను కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అభినందించారు. జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి సతీష్ మాట్లాడుతూ స్విమ్మింగ్ లో క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వడం జరిగిందని జాతీయ స్థాయిలో జరిగే మీట్ లో విజయం సాధించి కాకినాడ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
previous post
next post