24.7 C
Hyderabad
March 29, 2024 05: 45 AM
Slider ప్రత్యేకం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఘనంగా కళా ఉత్సవ పోటీలు

#kalajata

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కళా ఉత్సవ్ పోటీలను అకాడమిక్ మానిటరింగ్ అధికారి సతీష్ కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన విద్యార్థులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా న్యాయనిర్ణేతలు హైదరాబాద్ లోనే ఉండి జూమ్ ఆప్ ద్వారా వారి ప్రదర్శనలను వీక్షించారు. 

జిల్లా నుండి మొత్తం తొమ్మిది అంశాలలో విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించారు. విద్యార్థులు శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం జానపద సంగీతం జానపద నృత్యం చిత్రలేఖనం జానపద సంగీతం తదితర అంశాలలో విద్యార్థులు తమ ప్రదర్శనలు చేసి  ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి  గోవింద రాజు మాట్లాడుతూ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తారని రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపికైన విజేతల వివరాలు తేదీ 27 11 2021 ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ కృష్ణారెడ్డి సెక్టోరల్ ఆఫీసర్ వెంకటయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేవుళ్ల‌ను అవ‌మానించి వాళ్ల‌ను తిరిగి దూషిస్తే..నేర‌మెలా అవుతుంది….?

Satyam NEWS

వడ్డెర బస్తీ పనులను పరిశీలించిన కార్పొరేటర్

Satyam NEWS

గురురాఘవేంద్ర స్వామి ఛారిటబుల్ ట్రస్ట్ సహాయం

Satyam NEWS

Leave a Comment