27.7 C
Hyderabad
April 25, 2024 09: 07 AM
Slider విజయనగరం

కళా వెంకటరావు అరెస్ట్…! విడుద‌ల! ఎస్పీ వివరణ

sp Rajakumari

నెల్లిమర్ల పోలీసు స్టేషనులో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం అలాగే సంఘటన వివరాలు పూర్తిగా తెలుసుకొనేందుకు కిమిడి కళా వెంకటరావుని హాజరు కావాల్సిందిగా కోరామని విజ‌య‌న‌గ‌రం ఎస్పీ రాజ‌కుమారి పేర్కొన్నారు.


అయితే కళా వెంకటరావు సరిగ్గా స్పందించనందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం రూరల్ సిఐ కళా వెంకటరావును విచారణ నిమిత్తం పిలిచామన్నారు. అనంతరం, నోటీసు ఇచ్చి తిరిగి పంపించామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగానే కళా వెంకటరావును పిలిచామ‌ని, సంఘటనకు సంబంధించి విచారణ పూర్తయిన తరువాత విడిచి పెట్టామ‌న్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని దాన్నిగౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉందని ఎస్పీ తెలిపారు.

Related posts

ఖమ్మం విద్యా సంస్థల్లో సమ్మర్ క్యాంప్ లు

Satyam NEWS

28 సినిమాకు రెడీ అవుతున్న మహేష్ బాబు

Satyam NEWS

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం

Satyam NEWS

Leave a Comment