39.2 C
Hyderabad
March 28, 2024 15: 54 PM
Slider నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

#Pocharam

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరాయి.

ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ సమీపంలో మంజీర నది వద్ద గోదావరి మాతకు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ MP బిబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు జాజుల సురేందర్, హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ. శరత్, ఇరిగేషన్ CE మధుసూదన్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ భగీరధుడు “దివి నుంచి భువికి” గంగను తీసుకువస్తే నేడు అపర భగీరధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిని “భువి నుండి దివికి” తీసుకువచ్చాడని కొనియాడారు.

గోదావరి నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు అంటే అర కిలోమీటర్ ఎత్తిపోసి బీడు భూములకు నీరందిస్తున్నారని అన్నారు. ఏడాది మొత్తం నిజాంసాగర్ నిండు కుండలా ఉండాలనే నలబై ఏళ్ళ తన కల ఈరోజు నెరవేరిందని, కరోనా భయం ఉన్నా నెరవేరిన కలను కళ్ళారా చూసుకుందామనే ఈరోజు ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

గోదావరి జలాలు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి చేరిన ఈరోజు నిజంగా చారిత్రాత్మకం.. లక్షలాది రైతుల సాగునీటి కష్టాలకు ముగింపు పలికిన సందర్భం.. నది నీళ్ళు ఉప నదిలోకి ప్రవహించడం అంటే బిడ్డ దగ్గరకు తల్లి చేరడం వంటిది. ఇంత గొప్ప విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ వలనే సాధ్యం అయింది అని ఆయన అన్నారు.

Related posts

ఏపి మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య (హత్య?)

Satyam NEWS

రోడ్ టెర్రర్: సాగర్ హైవే పై లారీ ఆర్టీసీ బస్సు ఢీ

Satyam NEWS

మావోయిస్టుల పేరుతో వైన్ షాప్ దోపిడి

Satyam NEWS

Leave a Comment