28.7 C
Hyderabad
April 20, 2024 08: 19 AM
Slider ప్రత్యేకం

నిర్మలమ్మ బడ్జెట్ పై పెదవి విరిచిన కల్వకుంట్ల కవిత

#Kalwakuntla Kavitha

తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు.

గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని నిలదీశారు. కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తున్నారని అడిగారు. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు. కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5300 కోట్లు కేటాయించినందుకు సంతోషమే కానీ తెలంగాణకు చెందిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు కేటాయింపులేవని ప్రశ్నించారు.

నీతీ ఆయోగ్ సిఫారసు చేసిననప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు.

బడ్జెట్ ను మోదీ అంకెల గారడిగా అభివర్ణించారు.కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి ఇండ్లు మంజూరు అయ్యాయి

Satyam NEWS

అంబర్ పేట్ లో బస్తీలో బిఆర్ఎస్ కార్యక్రమం

Satyam NEWS

ఉపాధ్యాయ పోస్టులు పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment