39.2 C
Hyderabad
April 25, 2024 16: 09 PM
Slider మహబూబ్ నగర్

అక్రమ దందాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి

#KalwakurthyBusiness

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం అవినీతి అక్రమ దంతాలకు అడ్డాగా మారింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారుల కనుసన్నల్లో జోరుగా ఇసుక దందా, రేషన్ మాఫియా జరుగుతున్నాయని పలు వార్తా పత్రికలలో కథనాలే కాక ఆరోపణలు మాత్రం పట్టణంలో ఆ నోటా ఈ నోటా బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

అంతేగాక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ  నేత పై కూడా పలు ఆరోపణలు వార్త పత్రికలోనే గాక సోషల్ మీడియాలో, వెళ్ళువెత్తు తున్నాయి. హైదరాబాదులో భూకబ్జా, నియోజకవర్గంలో సొంత బంధువులే ఆయన పేరు చెప్పుకొని ఇసుక దందా చేస్తున్నారని, సిసిఐ పత్తి కొనుగోలులో ఆయన పాత్ర కీలకమని, పండిన పంట కంటే  పత్తి కొనుగోలు కేంద్రాలకు చాలావరకు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహాభారతంలో ధర్మరాజుకు భీముడు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సూది బెజ్జం నుండి ఏనుగు వెళ్ళింది  కానీ తోక ఇరుక్కు పోయింది అన్నట్లు కల్వకుర్తి పట్టణం అందుకు నిదర్శనంగా నిలిచింది. పలుకుబడి అధికారం డబ్బు ఉన్నవారు అవినీతికి పాలు పడ్డా సూది బెజ్జం నుండి ఏనుగు వెళ్లినట్టు దర్జాగా తిరుగుతున్నాడు.

కాగా ఆకలిని తట్టుకోలేక పదో పరక  అవినీతికి పాల్పడిన వాడు సూది బెజ్జం లో ఏనుగు తోక ఇరికిన విధంగా జైలు పాలవుతున్నాడు. ఇందుకు కారణం శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారులు వారికి వత్తాసు ఉన్నారా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది ప్రశ్నార్థకం.

పట్టణంలో అవినీతి రాజ్యమేలుతుంది

ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, గుట్కాలు, వివిధ అసాంఘిక కార్యకలాపాలతో పాటు నడి రోడ్లపై వాహనాలు నిలుపు తున్నారు. ఎగుమతులు దిగుమతులంటూ భారీ వాహనాలు నడిరోడ్డుపై నిలుపు తున్నారు. రహదారులపై నే వాహనాలు నిలిపి ఫోన్లు మాట్లాడుతున్నారు.

ట్రాఫిక్ నిలిచి పోయినా అడిగే నాథుడే కరువయ్యాడు. ఫిట్నెస్ లేని వాహనాలు, మద్యం సేవించి, చరవాణిలో మాట్లాడుతూ, అధిక వేగంతో వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు లేకపోవడం అసలు శాంతి భద్రతలను కాపాడాల్సిన అధికారులు ఊర్లో ఉన్నారా లేరా అన్న చందంగా ఉంది పరిస్థితి. గతంలో  ఉదయం ఆరు గంటల లోపు దిగుమతులు చేసుకునేవారు.

శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారులు విచ్చలవిడిగా వాహనాలు నిలిపే వారిపై కఠినంగా వ్యవహరించి చలనాలు రాసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవేమీ లేకపోవడంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు,తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

హిజ్రాలు రోజు వారిగా చేతులు చప్పట్లు కొట్టు కుంటూ బలవంతంగా చిరు వ్యాపారులపై పైసలు ఇవ్వాలంటూ దౌర్జన్యంగా వ్యవహరించడమే గాక డబ్బులు ఇవ్వని వారిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. బట్టలు విప్పటం చేతులు మీద వేయడం వారు అడిగినన్ని రూపాయలు ఇవ్వకుంటే నరకం చూపిస్తున్నారు.

ద్విచక్ర వాహనాలలో కార్లలో పురుషుల దుస్తులలో పట్టణ సమీపంలోకి వచ్చి మగువల వేష ధారణలోకి మారుతారు. ఆ వేషధారణలో అసలు వారు హిజ్రాలా, మగువలా, పురుషులా గుర్తించడం చాలా కష్టం. పాత కాలంలో హిజ్రాలను తిట్టారా దని కొట్టరాదని నమ్మకాలతో వారిని ఏమీ అనకపోవడం తో రెచ్చిపోతున్నారు.

సంవత్సరానికి ఏదో ఒక పండగ రోజు తప్పితే మళ్లీ కనిపించేవారు కాదు. ప్రస్తుతం రోజు ఐదు వేల నుండి పదివేల వరకు ఆదాయం రావడంతో హిజ్రాలు కాని వారు కూడా ఇదే  తరహాలో చప్పట్లు కొట్టు కుంటూ పైసల వసూళ్లకు తిరుగుతున్నారు. కల్వకుర్తి పట్టణంలోనే ఇంతమంది హిజ్రాలు ఉంటే దేశం మొత్తంలో ఎంత మంది ఉంటారు అని పట్టణవాసులు ఆశ్చర్య పోతున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కల్వకుర్తి నగరంలో  అన్ని అక్రమాలే జరుగుతున్నాయని బల్లగుద్ది చెప్పవచ్చు. శాంతి భద్రతలు కాపాడాల్సిన అధికారులు వేడుక చూస్తున్నారని గంటా పదంగా అనవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని శాంతి భద్రతలను కాపాడాలని నగరవాసులు వేడుకుంటున్నారు.

Related posts

డిఫెన్స్ లో ఉద్యోగాల పేరు తో డబ్బులు స్వాహా…!

Satyam NEWS

కరోనా నెగెటీవ్ వచ్చినా మీరు జాగ్రత్తలు పాటించాలి

Satyam NEWS

మరదలిపై యాసిడ్ దాడి చేసిన బావ

Satyam NEWS

Leave a Comment