28.7 C
Hyderabad
April 20, 2024 09: 10 AM
Slider మహబూబ్ నగర్

చలో రాజ్ భవన్ కు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు

#Kalwakurthy Congress

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డిమాట్లాడుతూ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగత గోప్యతను బట్టబయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అక్రమంగాఫోన్ ట్యాపింగ్ చేయటం దారుణమన్నారు.

మొన్న పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల సమస్యలపై నిలదీయాలని, నిరసన వ్యక్తం చేస్తుంటే అక్కడ కూడా అక్రమ అరెస్టులు చేయడం పై ఆయన మండిపడ్డారు.

చట్ట పరిధిలో న్యాయ పరిధిలో ప్రభుత్వ పాలనపై నిరసనలు వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజలకు నిరసన తెలియ చేసే హక్కు ప్రతి భారత పౌరుడికి భారత రాజ్యాంగం కల్పిస్తుందని దానిని ఈ పాలకులు హరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ,అరెస్టు చేసిన వారిని అందరిని వెంటనే విడుదల చేసి ఇందిరాపార్కు వద్ద జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.రాజకీయంగాఎదుర్కోలేక ప్రజల సమస్యలపై పోరాడే, కాంగ్రెస్ పార్టీ వ్యూహప్రతివ్యూహాలు తెలుసుకోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ టాపింగ్ చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకుడు నేరేటి నాని తదితరులుపాల్గొన్నారు.

Related posts

బాధిత కుటుంబానికి సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

మకర జ్యోతి కోసం వేచిఉన్న కోటి కన్నులు

Satyam NEWS

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ధ్యేయం

Satyam NEWS

Leave a Comment