38.2 C
Hyderabad
April 25, 2024 13: 22 PM
Slider మహబూబ్ నగర్

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

#Responce

సత్యం న్యూస్ లో ప్రచురితమైన ‘‘అక్రమ దందాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి’’ కథనంతో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం  పోలీస్ అధికారులు స్పందించారు.

ట్రాఫిక్  నియంత్రణ లో భాగంగా కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు, సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్  స్థానిక రక్షకభట నిలయ కార్యాలయంలో లారీ ట్రాన్స్ పోర్టు సిబ్బందితో,  హమాలీ వారిని సమావేశ పరిచి వారితో మాట్లాడారు.

ఉదయం 9:00 గంటలోపు వస్తువులు ట్రాన్స్ పోర్టు దిగుమతులు అయిపోవాలని సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీస్ వారితో సహకరించాలని కోరారు.

కల్వకుర్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం చిరు వ్యాపారులతో, వ్యాపారస్తుల తో మాట్లాడుతూ ప్రధాన కూడలి లో గల రహదారులపై వాహనాలు నిలుపరాదు అని చెప్పారు.

వాహనాలు నిలుపకుండా చూడాలని    ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించాలని సి. ఐ. సూచించారు. ఇష్టానుసారం  రోడ్లపై వాహనాలు నిలిపిన వారిపై అపరాధ రుసుము వేస్తామని హెచ్చరించారు. 

పాదచారులకు ప్రయాణికులకు కు ఇబ్బంది కాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదులు ఎస్సై మహేందర్ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నిర్దేశించిన విధంగా రుణాలివ్వాలి

Bhavani

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

కక్షతోనే రాజధాని రైతులకు కౌలు వేధింపులు

Satyam NEWS

Leave a Comment