31.2 C
Hyderabad
April 19, 2024 04: 29 AM
Slider మహబూబ్ నగర్

ఎట్రాషియస్: కిరాణా షాపులపై పోలీసుల దాష్టీకం

kalwakurthy police

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వ్యాపారస్తుల పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు కిరాణా వ్యాపారస్తుల పై వారి జులుం ప్రదర్శిస్తున్నారు. కల్వకుర్తికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమనగల్ మండలంలో   ఉదయం నుండి  సాయంత్రం 4 వరకు వ్యాపారం కొనసాగిస్తుంటే కల్వకుర్తిలో మాత్రం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉండాలని ఒక నిమిషం అటూ ఇటూ అయినా వ్యాపారస్తుల పై లాఠీ విరగ్గొడుతున్నారు.

దీనివల్ల దుకాణాలు 11 గంటలకే మూసి వేస్తారని భయపడుతూ ఒకరిమీద ఒకరు పడుతూ సామాజిక దూరం పాటించకుండా కొనుగోలుదారులు ఎవరు చెప్పినా వినకుండా వారికి కావలసిన  సరుకులు తీసుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. కల్వకుర్తిలో  వ్యాపారాలు 11 గంటలకే మూసివేయాలని అని ఎవరు ఆదేశాలు ఉన్నాయో ఎవరికి తెలియదు.

కానీ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు గంటల వరకు సాయంత్రం నిత్యవసర వస్తువులు దొరుకుతాయని సామాజిక దూరం పాటించి వారికి కావలసిన నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలని తెలిపారు. కానీ కల్వకుర్తిలో మాత్రం 11 గంటలకే దుకాణాలను మూసివేయాలని పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో సామాజిక దూరం పాటించకుండా ప్రజలు వారి కావాల్సిన నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో  కరోణ వైరస్ సోకే ప్రమాదముంది.

వ్యాపారస్తులు ఎంత మొత్తుకున్నా ను సామాజిక దూరం పాటించమని ప్రజలు వినడం లేదు బ్యాంకుల ముందు సైతం సామాజిక దూరం పాటించకుండా ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉంటాం ప్రజలు చేసే తప్పులకు వ్యాపారస్తుల కు శిక్ష పడుతున్నది.

రేషన్ బియ్యం మందు మద్యం అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రయత్నాలు అడ్డుకోవడంలో విఫలమౌతున్న పోలీసులు దుకాణదారులు పై విజృంభించడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు గత వారం క్రితం పోలీసుల దెబ్బలకు తాళలేక ఒకరోజు దుకాణాలు ముయడంతో ప్రజలు నిత్యావసరాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు.  ఇదేవిధంగా పోలీసులు వ్యాపారులను కొడితే దుకాణాలు మూసివేస్తే నిత్య అవసరాల కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పదు.  ఇప్పటికైనా పోలీసులు స్పందించి వ్యాపార పని వేళలు పొడిగించే విధంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ప్రజలు కరోనా వైరస్ రోగాల బారిన పడకుండా  ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు

Satyam NEWS

ఆదిలాబాద్ రూరల్ జడ్పిటిసి బరిలో రాజన్న తనయుడు

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ నేత జూపల్లి మరో ఉద్యమానికి సిద్ధం?

Satyam NEWS

Leave a Comment