27.7 C
Hyderabad
April 26, 2024 05: 13 AM
Slider రంగారెడ్డి

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Kalyana Laxmi Sabitha

తెలంగాణ రాష్ట్రా ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అంద‌జేస్తున్నక‌ళ్యాణ‌లక్ష్మీ ప‌థ‌కం చెక్కుల‌ను సోమ‌వారం మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి మీర్‌పేట్‌, బ‌డంగ్‌పేట్‌, జ‌ల్‌ప‌ల్లిల‌లో పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడ‌పిల్ల‌ల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్ ఓ వ‌రంలాంటింద‌న్నారు. ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రుల‌పై ఆర్థిక భారం ప‌డ‌కూడ‌ద‌నే అంద‌రితో స‌మానంగా ఆడ‌పిల్ల‌ల‌ను కూడా ఎద‌గ‌నీయాల‌నే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించార‌న్నారు. ఎంతో ఉన్న‌త ల‌క్ష్యంతో ప్రారంభించిన ఈ ప‌థ‌కం నిర్విరామంగా, నిరంత‌రంగా కొన‌సాగ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

బ‌డంగ్‌పేట్‌, మీర్‌పేట్ ప‌రిధిలో 274 చెక్కులు, జ‌ల్‌ప‌ల్లి ప‌రిధిలో 264 చెక్కులు మంజూరు కాగా ప‌లువురికి మంత్రి చెక్కుల‌ను అంద‌జేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం అందించిన చెక్కుల‌తో ఆయా కుటుంబాలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వ‌ర‌ద ముంపు బాధితుల భ‌యం.. భ‌యం..

కాగా, ఆయా కార్య‌క్ర‌మాల‌కు మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి వ‌స్తున్న విష‌యాన్ని ముందే తెలుసుకున్న వ‌ర‌ద ముంపు బాధితులు పెద్ద ఎత్తున ఆమె వ‌స్తున్న ప్రాంతానికి వ‌చ్చి ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌య్యారు.

పోలీసుల అప్ర‌మ‌త్త‌త‌..

కాగా ఇదే విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన పోలీసులు మంత్రి ప‌ర్య‌ట‌న ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ఆయా చోట్ల ఆందోళ‌న‌ల‌కు ముంపు బాధితులు సిద్ధ‌మైనా.. పోలీసులు అప్ర‌మ‌త్తం కావ‌డంతో మంత్రి ఆయా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకొని వెళ్లారు.

స‌బితా ఇంద్రారెడ్డి చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో కందుకూరు డివిజ‌న్ ఆర్డీవో ర‌వీంద‌ర్‌రెడ్డి, బ‌డంగ్‌పేట్‌, మీర్‌పేట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్లు చిగురింత పారిజాత న‌ర్సింహారెడ్డి, దుర్గాదీప్‌లాల్ చౌహాన్‌, డిప్యూటీ మేయ‌ర్లు ఇబ్రాం శేఖ‌ర్‌, తీగ‌ల విక్ర‌మ్‌రెడ్డి, బాలాపూర్ ఎమ్మార్వో శ్రీ‌నివాస్‌రెడ్డి, క‌మిష‌న‌ర్ క్ర‌ష్ణ‌మోహ‌న్‌రెడ్డి, జ‌ల్‌ప‌ల్లిలో క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్ క‌మార్ మున్సిప‌ల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

రండి తరలి రండి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి

Bhavani

కరోనా ఫియర్: గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు

Satyam NEWS

స్పోర్ట్స్ జోన్: విన్నర్ ఉత్తరప్రదేశ్ రన్నర్ తమిళనాడు

Satyam NEWS

Leave a Comment