31.2 C
Hyderabad
April 19, 2024 06: 17 AM
Slider ఆదిలాబాద్

క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

#KalyanaLaxmi

నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలానికి చెందిన 167 మంది కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు ఆదివారం మండలం లోని వడ్యల్ గ్రామంలో  ఏర్పాటు చేసిన  చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల్ల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీయం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్  ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.

ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారిందని ఆయన పేర్కొన్నారు.  నిర్మల్ నియోజకవర్గం లో ఈ సారి ఇప్పటి వరకు 1150 మందికి చెక్కులు పంపిణి చేశామని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎక్స్ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మండల ఇంఛార్జి సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ రఘు నందన్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మీ రమేష్, నాయకులు అడ్వాల రమేష్, సల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన బాబు రాజేంద్ర ప్రసాద్

Satyam NEWS

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Satyam NEWS

ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ నిజం కాదని మావోల ప్రకటన

Satyam NEWS

Leave a Comment