27.7 C
Hyderabad
April 18, 2024 08: 55 AM
Slider మహబూబ్ నగర్

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

#KollapurMLA

పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మీ పథకం ఏర్పాటు చేశామని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని  పెద్దకొత్తపల్లి మండలం వెన్నెచెర్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులను KLI గెస్ట్ హౌస్ లో ఆయన అందచేశారు.

పేదల సంతోషమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు. అందరూ ఆత్మాభిమానంతో బతకాలన్నదే సీఎం ఆకాంక్ష అని ఎమ్మెల్యే అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రమే తన కుటుంబం అన్న కోణంలో ఆలోచిస్తారని, అందుకే కళ్యాణలక్ష్మి లాంటి పథకం వచ్చిందని అన్నారు.

ఆడబిడ్డలకు అమ్మవడి కేసీఆర్ కిట్ పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయకోణం ఉందని, అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడలన్నదే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.

గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డ వివాహానికి సహాయం చేయలేదని, ఆడపడుచులు సగౌరవంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోర్ట్ జోక్యంతో భంగపాటు

Murali Krishna

నాలుగో విడ‌త‌లో 13,830 మందికి వాహ‌న‌మిత్ర ఆర్ధిక‌ స‌హాయం

Satyam NEWS

తొలితరం ఉద్యమకారుడు చిరంజీవిని పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment