39.2 C
Hyderabad
March 28, 2024 16: 05 PM
Slider హైదరాబాద్

ఉప్పల్ లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

#kalyanalaxmi

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న  కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి  అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గం పరిదిలోని ఉప్పల్‌, నాచారం, మల్లాపూర్‌, చిల్కానగర్‌, హప్సిగూడ, రామంతాపూర్‌ , మీర్పేట్‌  హెచ్ బి.కాలనీ  డివిజన్‌లకు చెందిన లబ్దిదారులకు ఉప్పల్‌ మండల తహసీల్‌దార్‌ అధ్యక్షతన  సోమవారం  మేకల భారతిగార్డెన్‌ లో  508 మంది లభ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,  షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మేల్యే  మాట్లాడుతూ ముఖ్యమంత్రి  పేదల సంక్షేమానికి  అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ కళ్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలను ప్రవేశ  పెట్టారని ఈ పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంగా మారిందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కార్పోరేటర్‌లు పన్నాల దేవేందర్‌రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్‌, శాంతి సాయిజన్‌శేఖర్‌, బన్నాల గీతప్రవీణ్‌ముదిరాజ్‌, చేతన, వాణి, మందముల రజిత పరమేశ్వరరెడ్డి ఉప్పల్‌ డిప్యూటీ తహసీల్‌దార్‌ మహ్మద్‌ రఫి, ఆర్‌.ఐ. షాహిన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ అనంతరాములు, వీఆర్‌ఎలు సుమన్‌, నాగలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు మేకల మధుసూధన్‌రెడ్డి, వేముల సంతోష్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌, చింతల నరసింహారెడ్డి, లక్ష్మినారాయణ, కట్ట బుచ్చన్నగౌడ్‌, బాలరాజు, జైపాల్‌ ,సత్యపాల్‌రెడ్డి, రవీందర్‌, రామకృష్ణ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంగోలులో తెలంగాణ పోలీసులపై దౌర్జన్యం చేసిన వైసీపీ నేత

Satyam NEWS

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

ఎనాలసిస్: చర్చల మాటున.. చిచ్చుల బాటన…

Satyam NEWS

Leave a Comment