33.2 C
Hyderabad
April 26, 2024 01: 07 AM
Slider కరీంనగర్

పేదింట్లో కల్యాణలక్ష్మి కాంతులు తెలంగాణ ప్రత్యేకం

తెలంగాణ సర్కారు నిరుపేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి అందజేస్తూ అండగా ఉంటుందని శిశు సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

నేడు హుజురాబాద్ సాయి రూప గార్డెన్ లో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు సుమారు 5 కోట్ల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తో కలసి పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బిజెపి పాలిత ప్రాంతాల్లో కళ్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ఉన్నాయా ఆని ప్రశ్నించారు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని వెల్లడించారు.. పేదింటి ఆడబిడ్డలకు గొప్పవరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని అన్నారు..బడుగు, బలహీన వర్గాల ఆడబిడ్డల వివాహాలకు ఇబ్బంది కలుగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఒక మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,00,116/- రూపాయలను అందజేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు. పేదలు రెక్కడితే గానీ డొక్కాడదు, ఎక్కువ డబ్బు ఉండదని అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టారని తెలిపారు.

అలాగే ఆసరా పెన్షన్, వృద్దాప్య పెన్షలను కూడా ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. మాతా శిశు సంరక్షణరక్షణ కేంద్రంలో తొలి కాన్పుకు కే.సి.ఆర్. కిట్లు ఇస్తున్నామని, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు అందజేస్తున్నరని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో MLC పాడి కౌశిక్ రెడ్డి ,SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ,జెడ్పి చైర్మన్ కనమల్ల విజయ ,అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆయా మండలాలతహశీల్దార్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన యరగాని నాగన్న

Satyam NEWS

రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ పరామర్శ

Satyam NEWS

సీతారాంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment