39.2 C
Hyderabad
March 29, 2024 16: 03 PM
Slider ఆధ్యాత్మికం

ధూప దీపాలకూ నోచుకోని కల్యాణ వేంకటేశుడు

#Kalyana Venkateswarudu

శ్రీకాకులం జిల్లా, వంగర మండలం సంగాం – అనగానే మదిలో కదలాడేది సంగమేశ్వరాలయం. దక్షిణ కాశీగా, దేవతా నిర్మితంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో దర్శనమిస్తుంది చిద్విలాస రూపుడైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని దేవాలయం. 1965 లో నిర్మిత దేవాలయo ఇది.

సరసనాపల్లికి చెందిన సోడిశెట్టి సీతారామయ్య గుప్త దీనిని నిర్మించారు. నాటి నుంచి ఆలయ అర్చక బాధ్యత సంగాం అగ్రహార వాసి నిష్టల వెంకట్రావు నిర్వర్తించారు. ౩౦  సంవత్సరాలుగా సేవలందించి స్వవర్గీయులైన తరువాత ఆయన కుమారుడు శ్రీనివాస సిద్ధాంతి ౩౦ సంవత్సరాలుగా స్వామివారి పూజాదికాలు, భోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 ఇంత చరిత్రకలిగిన ఈ దేవాలయం దేవాదాయశాఖ ఇచ్చే ధూప ,దీప ,నైవేద్య పారితోషకానికి ఇప్పటివరకు నోచుకోలేదు .ప్రధానార్చకులు పలుసార్లు ఈ విషయాన్ని అధికారులవద్ద మొరపెట్టుకున్నా ,ఇప్పటి కింకా మంజూరు కాలేదు.

నిన్నమొన్నటి నిర్మిత ఆలయాలకు మంజురు చేస్తూ ,తమ ఆలయానికి మంజురు చెయ్యకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు. ఈ ఆలయాన్ని నమ్ముకొని 60 సంవత్సరాలుగా తమ కుటుంబం జీవిస్తున్నదని ,శివరాత్రి పర్వదినం – ఆ వారం రోజుల యాత్రనాడు తప్ప మిగిలిన దినాలలో జనసంచారం ఉండదు.

దేవాదాయశాఖ అధికారులు ఆదుకొని, ధూప దీప నైవేద్యాదికాల నెలసరి గౌరవ వేతనాన్ని మంజురు చెయ్యాలని శ్రీనివాస సిద్ధాంతి కోరుతున్నారు.

Related posts

వందేళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ ఈ స్థాయి కి చేరింది

Satyam NEWS

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ కోఆర్డినేటర్ గా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

చివరి రోజుల్లో మోత్కుపల్లి దిగజారి ప్రవర్తిస్తున్నారు: కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

Leave a Comment