30.7 C
Hyderabad
April 19, 2024 09: 18 AM
Slider నల్గొండ

దేశంలోనే అద్భుతమైన పథకం కళ్యాణ లక్ష్మీ

#DevarakondaMLA

తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేదింటి ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదో ఒక సహాయం చేయాలని గొప్ప మనస్సుతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మీ పథకం అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలానికి చెందిన 7మంది లబ్ధిదారులకు రూ.7లక్షలు కళ్యాణి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తల్లులు ఆడపిల్లలు పుట్టితే అమ్ముకునే పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆయన అన్నారు.

అయితే నేడు ఆడపిల్ల పుడితే లక్ష్మీ దేవి పుట్టిందని భావిస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో గొప్ప అవకాశాన్ని నంది పలికి, పేదింటి ఆడపిల్ల వికలాంగురాలు అయితే 1లక్ష 25 వేల రూపాయలు నిర్ణయించారని ఆయన అన్నారు.

ప్రతి ఆడబిడ్డకు డెలివరీ సమయంలో ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత కేసీఆర్ ది అని అన్నారు. ప్రతి గడపకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు  అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సిరందాసు కృష్ణయ్య, తహశీల్దార్ కీరణ్మయి,TRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా టీచర్ ను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

Bhavani

సీఐకు అరెస్ట్ వారెంట్

Sub Editor 2

వరదల కారణంగా ఆర్ధికంగా పతనమైన పాకిస్తాన్

Bhavani

Leave a Comment