29.2 C
Hyderabad
September 10, 2024 16: 55 PM
Slider ప్రపంచం

ఆమె అవునంటే ఆయన కాదనిలే….

#kamalaharis

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫాక్స్ న్యూస్ ఛానెల్ వచ్చే నెల 4న అతిథ్య డిబేట్ లో పాల్గొందామని కమలా హారిస్ కు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేశారు. అయితే డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను కమలా హారిస్ తిరస్కరించారు.

డెమోక్రాట్ల అభ్యర్ధిగా జో బైడెన్ ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ అతిథ్యంలో సంవాదం జరుపుతామని కమలా హారిస్ స్పష్టం చేశారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే .. అని గతంలో అన్న వ్యక్తి (ట్రంప్) ఇప్పుడు నిర్దిష్ట తేదీన, నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో అని ప్రతిపాదించడం విచిత్రంగా అనిపిస్తోందని కమలా హారిస్ అన్నారు. ట్రంప్ చేసిన కొత్త ప్రతిపాదన తనకు అంగీకారం కాదని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 10న డిబేట్ లో పాల్గొనేందుకు ట్రంప్ ముందుగా అంగీకరించినందుకు తాను అదే తేదీన చర్చకు వస్తానని కమలా హారిస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.

తొలుత అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ లు సీఎన్ఎన్ ఆతిథ్యంలో జూన్ లో నిర్వహించిన తొలి డిబేట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 10న ఏబీసీ న్యూస్ నిర్వహణలో రెండో డిబేట్ లో పాల్గొనాలని ఇద్దరూ అంగీకారానికి వచ్చారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో పోటీ నుండి బైడెన్ వైదొలగడంతో ఆయన స్థానంలో కమలా హారిస్ తెరపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న పాక్స్ న్యూస్ ఛానెల్ నిర్వహణలో డిబేట్ లో పాల్గొందామంటూ ట్రంప్ ప్రతిపాదన చేయడాన్ని కమలా హారిస్ తప్పుబట్టారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

Related posts

అప్పుడు కన్ను గీటి ఇప్పుడు స్మిమ్మింగ్ పూల్ లో మునిగి

Satyam NEWS

మావోలూ మీరంతా లొంగిపోతేనే మేలు

Satyam NEWS

డీఎస్పీ పాపారావు అకాల మరణం తీరని లోటు

Satyam NEWS

Leave a Comment