40.2 C
Hyderabad
April 24, 2024 17: 03 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి పట్టణ సిఐ జగదీష్ అరెస్ట్

#KamareddyCI

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ సిఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. సిఐ అరెస్ట్ మరెంత మంది మెడకు చుట్టుకుంటుందోనని అధికారుల్లో కలవరం మొదలైంది.

అవినీతికి నిలయంగా పోలీసు శాఖ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. సివిల్ పంచాయతీలు, స్కీముల విషయాల్లో జ్యోక్యం చేసుకుంటూ లక్షలాది రూపాయలు నొక్కేస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పని వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో కొందరు బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ముగ్గురు సిఐలు ఏసీబీ వలకు చిక్కారు

హాట్ టాపిక్ గా సిఐ వ్యవహారం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ సిఐ జగదీష్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సిఐ జగదీష్ పై క్రికెట్ బెట్టింగ్ విషయంలో లంచం డిమాండ్ చేసాడన్న ఆరోపణలు రావడంతో పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు సిఐ ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో సోదాలు జరిపారు. సోదాలలో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కొంప ముంచిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడకు చెందిన బత్తుల సుధాకర్ క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులకు చిక్కాడు. ఇదే అదునుగా భావించిన సిఐ జగదీష్ సుధాకర్ విడుదల కావడానికి స్టేషన్ బెయిల్ కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసాడు. మొదటి విడతగా లక్ష 39 వేలు ముట్టజెప్పిన సుధాకర్ మిగతా డబ్బులు బయటకు వచ్చాక ఇస్తానని చెప్పాడు. దాంతో అతనికి సిఐ స్టేషన్ బెయిల్ ఇప్పించాడు. మిగతా డబ్బుల కోసం సుధాకర్ కు సిఐ ఫోన్ చేయగా ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

రెండు టీంలతో ఏసీబీ సోదాలు

దాంతో శుక్రవారం నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సిఐ ఇంటితోపాటు ఆయన కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించి పలుకీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్ విషయంల్ జిల్లా కేంద్రంలోని ఓ మొబైల్ షాప్ లో పని చేస్తున్న సృజయ్ అనే వ్యక్తి సిఐ జగదీష్ కు బెట్టింగ్ నిర్వాహకుల వివరాలు అందించాడని తెలుసుకున్న అధికారులు ఇద్దరిని ఒకేచోట ఉంచి విచారించారు.

విచారణలో కీలక సమాచారం సేకరించిన అధికారులు సిఐ జగదీష్, సృజయ్ లను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సిఐ అరెస్ట్ అంశం ఇంకా ఎవరెవరికి చుట్టుకుంటుందోనని పలువురు అధికారులు టెన్షన్ పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఇప్పటికే కొందరు బెట్టింగ్ రాయుళ్లు సిఐ జగదీష్ కు లక్షల్లో ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.

 అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనే విషయంతో పాటు ఇంకేత మంది అధికారులకు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందొ నిగ్గు తేల్చానున్నారు. బెట్టింగ్ విషయమే కాకుండా జిల్లా కేంద్రంలో జరుగుతున్న లక్కీ డ్రా స్కీములు, బీర్షబా లాంటి స్కీము విషయంలో సిఐపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి

Related posts

ఐ ఎన్ టి యు సి కరపత్రాల ఆవిష్కరణ

Satyam NEWS

“ఆహా”లో సూపర్ అనిపిస్తున్న టి.మహీపాల్ రెడ్డి “పోస్టర్”

Satyam NEWS

తిరిగిరాని వలస!

Satyam NEWS

Leave a Comment