40.2 C
Hyderabad
April 19, 2024 16: 15 PM
Slider నిజామాబాద్

కరోనా ఎఫెక్ట్: కామారెడ్డిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

#Kamareddy Municipality

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. స్వీయ లాక్ డౌన్ విధించుకున్నారు. ఓ వ్యాపారి కుటుంబానికి కరోనా సోకడం, అతని ద్వారా ఓ బియ్యం వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ముందు జాగ్రత్తలో భాగంగా శనివారం నుంచి నేటి వరకు కిరాణా వర్తక వ్యాపారులకు సంబందించిన దుకాణాలన్నీ మూసి ఉంచారు. కరోనా వ్యాప్తి జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాయంత్రం నాలుగు వరకే దుకాణాలు

రేపటి నుంచి జిల్లా కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. నేడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులందరు సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

రేపటి నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ఆ సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని తీర్మానించారు.

పలు మండల కేంద్రాల్లో స్వీయ లాక్ డౌన్

జిల్లా కేంద్రంలో వ్యాపారులకు కరోనా సోకడం నియోజకవర్గంలో కలకలం సృష్టించింది. ప్రతి రోజు వివిధ మండలాల నుంచి వందలాదిగా వచ్చి కామారెడ్డిలో సరుకులు తీసుకుని వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతానికి కరోనా రాకుండా ఉండాలని పలు మండల కేంద్రాల్లో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్వీయ లాక్ డౌన్ ఏర్పాటు చేశారు.

ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. భిక్కనూర్ మండల కేంద్రంలో జరిగిన ఓ పార్టీకి వచ్చిన బ్యాంక్ మేనేజర్ కు కరోనా పాజిటివ్ సోకడంతో గత మూడు రోజులుగా భిక్కనూర్ మండల కేంద్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటున్నాయి.

మెడికల్ దుకాణాలు, విత్తన షాపులు, మద్యం దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తున్నాయి. ఇదే విధానాన్ని దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట మండల కేంద్రాల్లో అవలంబిస్తున్నారు. రేపటి నుంచి ఈ మండల కేంద్రాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరిచి ఉండనున్నాయి.

గాంధారిలో మొదటి పాజిటివ్ కేసు

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు జిల్లా వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. బాధితునికి కరోనా లక్షణాలు ఉండటంతో నిన్న అతని రక్త నమూనాలు హైదరాబాద్ తరలించారు. నేడు అతనికి పాజిటివ్ రాగ అధికారులు అప్రమత్తమయ్యారు.

గాంధారి మండలం ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గతంలో జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నమోదు అయినప్పుడు బాన్సువాడ, కామారెడ్డి తప్ప ఎల్లారెడ్డిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో కూడా మొట్టమొదటి పాజిటివ్ కేసు నమోదయింది.

రైస్ మిల్లుకు వచ్చిన వారిలో ఆందోళన

అయితే బాధితునికి కరోనా ఎలా వచ్చింది అనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. అతడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు అతని ప్రైమరీ కాంటాక్టులను సేకరిస్తున్నారు. సంబంధిత బాధితుడు ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. ప్రస్తుతం రైస్ మిల్లుకు వచ్చిన వారిలో ఆందోళన నెలకొంది.

ఎల్లారెడ్డిలో కరోనా ఆంక్షలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించాలని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాల వారికి సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని కోరారు. అలాగే గాంధారి మండల కేంద్రంలో కూడా ఆంక్షలు విధించినట్టు సమాచారం.

Related posts

భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం

Bhavani

విదేశాల నుంచి మావోయిస్టు గణపతి ఎప్పుడొచ్చారు?

Satyam NEWS

బిల్లు కోసం వేధించిన కొటెక్ మహేంద్ర బ్యాంకుకు జరిమానా

Satyam NEWS

Leave a Comment