37.2 C
Hyderabad
March 28, 2024 20: 54 PM
Slider ముఖ్యంశాలు

మాస్టర్ ప్లాన్ మార్చకపోతే ఆత్మహత్యలే శరణ్యం

#rastaroko

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పాత రాజాంపేట రైతులు పేర్కొన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వల్ల తమ భూములన్నీ ఇండస్ట్రియల్, బఫర్ జోన్లోకి వెళ్తున్నాయని, తద్వారా తాము రోడ్డున పడతామని పాత రాజంపేట రహదారిపై ఆందోళనా చేపట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అక్కడినుంచి పంపించి వేయడంతో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ తో మాట్లాడారు. అనంతరం వారి అభ్యంతర దరకాస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పాత రాజంపేట గ్రామంలో 98 శాతం భూములు ఇండస్ట్రియల్, భఫర్ జోన్లో పోతున్నాయన్నారు. కమిషనర్ ను అడిగితే మీ కౌన్సిలర్ కూడా సంతకం పెట్టాడు. మీ భూములు కూడా ఇందులో ఉన్నాయి అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన 484 ఎకరాలు మాస్టర్ ప్లాన్ లో పోతున్నాయని, తమకు ఈ భూములే దిక్కని, ఆ భూములను కోల్పోతే ఆత్మహత్యలే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము అన్ని విధాలుగా నష్టపోయామన్నారు.

హౌసింగ్ కోసం 94 ఎకరాలు, సబ్ స్టేషన్ కోసం 50 ఎకరాలు, 20 ఎకరాలు 220 కెవి కోసం ఇచ్చామని, మున్సిపల్ డంపింగ్ యార్డు కూడా ఇక్కడే ఏర్పాటు చేయడంతో చెత్త తగులబెట్టినపుడల్లా వచ్చే వాసనతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ లో భూములు పోతున్న విషయం మీకు తెలియదా అని అడగ్గా తమ భూములు పోవడం లేదని మాత్రమే తమకు తెలుసని, కౌన్సిలర్ కూడా ఈ విషయం చెప్పలేదన్నారు. వెంటనే ఈ మాస్టర్ ప్లాన్ మార్చాలని కోరారు.

ఉన్న రోడ్డు చాలు.. వెడల్పు వద్దు: బీడీ కాలనీ వాసుల ఆవేదన

కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ ఎంతో మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే వందల ఎకరాల భూములు కోల్పోతున్నామని రైతులు ఆందోళనకు దిగగా తాజాగా ఇండ్లు కూడా మాస్టర్ ప్లాన్ లో పోతున్నాయని కామారెడ్డి పట్టణంలోని బీడీ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు.

బీడీ కాలనీలో 30 ఫీట్లు ఉన్న రోడ్డును 60 ఫీట్లకు పెంచడాన్ని నిరసిస్తూ కాలనీ వాసులు కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికే మూడు ప్రధాన రహదారులు అక్కడ ఉన్నాయని, ఇప్పుడున్న రోడ్డు కూడా ట్రాక్టర్, లారీ పోయేంత ఉందని, దానిని ఇంకా వెడల్పు చేయవద్దని కోరారు. రోడ్డు వెడల్పు వల్ల 700 ఇండ్లు రోడ్డులో పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు పోయాక తాము ఎక్కడ ఉంటామని ప్రశ్నించారు. వెంటనే రోడ్డు వెడల్పు ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు.

Related posts

మాస్క్ లేకుండా మొగుడ్ని ముద్దు పెట్టుకుంటానన్న యువతి అరెస్టు

Satyam NEWS

శాండ్‌విచ్ దీవులలో భూకంపం: అసలు భూకంపాలు ఎలా వస్తాయి?

Satyam NEWS

రైలు క్రింద పది తండ్రి, కొడుకుల ఆత్మహత్య

Murali Krishna

Leave a Comment