37.2 C
Hyderabad
April 19, 2024 14: 50 PM
Slider ముఖ్యంశాలు

Kamareddy Masterplan: రిట్ పిటిషన్ విచారణ వాయిదా

#masterplan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వల్ల తమ భూములు కోల్పోతున్నామని గత నెల రోజులుగా రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తమ భూముల్ని రిక్రియేషన్ జోన్ గా ప్రకటించారని మాస్టర్ ప్లాన్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని 40 మంది రైతులు రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ హైకోర్టు మెట్టలెక్కారు.

దాంతో ఈరోజు రైతుల రిట్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. రైతుల తరపున న్యాయవాది సృజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను కోర్టుకు సమర్పించారు. వాదనలు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏజీ కోర్టును కోరగా అంగీకరించింది. బుధవారం కౌంటర్ దాఖలు చేయాలని విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రైతుల ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. నేడు మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి మాటర్ ప్లాన్ పై అభ్యంతరాల సమయం ముగిసిన మరుసటి రోజు ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయడానికి సహకరించాలని కోరారు.

Related posts

మేడా నిలయంలో వైయస్సార్సీపి ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

సీక్రెట్: రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఈ పదవిని ఎందుకు స్వీకరించారు?

Satyam NEWS

పోలీసుల మెడకు చుట్టుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్డు భూ వివాదాలు

Satyam NEWS

Leave a Comment