39.2 C
Hyderabad
March 29, 2024 15: 21 PM
Slider నిజామాబాద్

రివర్స్ హ్యాండ్: తిరగబడిన కాంగ్రెస్ చరిత్ర

kamareddy municipality

కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగబడింది. 1988 లో మున్సిపాలిటీ చైర్మన్ గా మొదలైన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కసారిగా ప్రశ్నార్థకమైంది. నేడు వెలువడిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 23 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడానికి సిద్ధమైంది.

కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్తగా చేరిన 7 గ్రామలతో కల్పి 33 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ 49 వార్డులకు చేరింది. ప్రస్తుతం జరిగిన 49 వార్డుల ఎన్నికల్లో టిఆర్ఎస్ 23, కాంగ్రెస్ 12, బీజేపీ 08, ఇండిపెండెంట్ అభ్యర్థులు 06 స్థానాలను గెలుచుకున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి చైర్మన్ అయ్యేంత మెజారిటీ లభించింది. అయితే చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మంత్రి కేటీఆర్ హామీ మేరకు 33 వ వార్డు నుంచి గెలుపొందిన నిట్టు జాహ్నవి చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నా మరో ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద గత 32 సంవత్సరాల కామారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో నాలుగు సార్లు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం సగం మెజారిటీ స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠం కంచుకోటగా ఉన్న ఆ స్థానాన్ని గులాబీ పార్టీ అధిష్టించనుంది.

Related posts

ఈ సమయంలో ఆన్ లైన్ కు ప్రత్యామ్నాయం ఇది

Satyam NEWS

రాజంపేట ను నెల లోపు జిల్లా కేంద్రంగా ప్రకటించక పోతే రాజీనామా

Satyam NEWS

త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..

Sub Editor

Leave a Comment