30.7 C
Hyderabad
April 19, 2024 08: 55 AM
Slider తెలంగాణ

కామారెడ్డి లో ఆర్టీసీ కార్మికుల వినూత్న ప్రదర్శన

kama rtc

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఆర్టీసీ కార్మికులు పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. 15 వ రోజు ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచి బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బంద్ సందర్బంగా డిపోకు చెందిన 120 బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. తాత్కాలిక సిబ్బంది ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. 15 వ రోజు సమ్మెను కార్మికులు కొనసాగించారు. టెంట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిండప్రదానం చేశారు. ఎంతపని చేశావయ్య ముఖ్యమంత్రి అంటూ ఏడ్చినట్టు నటించారు. మరోవైపు బంద్ లో పాల్గొన్న కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సైతం ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టగా మహిళా కార్మికులను సైతం పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్టులను నిరసిస్తూ పోలీసుల వాహనాలకు ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో వాహనాన్ని వెనక నుంచి పంపించేశారు. మరోవైపు ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. బంద్ సందర్బంగా సుమారు 200 మందితో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు

Related posts

జాతీయ సమగ్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి

Satyam NEWS

రిక్వెస్ట్: ఆర్ట్స్, క్రాఫ్ట్, పిఈటి లను రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

ఎంత మంది గొంతు నొక్కుతారు?

Satyam NEWS

Leave a Comment