39.2 C
Hyderabad
April 18, 2024 17: 04 PM
Slider ఆధ్యాత్మికం

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి

#sakhambaridevi

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వయంగా వెలిసి భక్తులచే నిత్యం పూజలందుకుంటున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం లోని మూలమూర్తి కి శాకాంబరీ దేవిగా అలంకరించారు.

ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ పౌర్ణమి రోజున రకరకాల కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుంటే అన్నపానాదులకు లోటు ఉండదని పూర్తి ప్రగాఢ విశ్వాసం. సోమవారం పుష్య శుద్ధ పౌర్ణమి రోజు కావటంతో ఆలయ అర్చకులు నరగిరినాధుని రంగభట్రాచార్యులు ఆధ్వర్యంలో  ప్రాతఃకాల సమయంలో పంచసూక్త విధానంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో,కాయగూరలతో సర్వాంగ సుందరంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు.

ప్రదోష కాలంలో సహస్ర నామ కుంకుమార్చన,సహస్రనామాలతో గులాబీ పుష్పాలతో విశేష పూజలు నిర్వహించి,మహా నీరాజన మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భక్తులు కోవిడ్ -19 నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శ్రీ కనకదుర్గ అమ్మవారి ని దర్శించుకుని తరించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు మరో ఉద్యమానికి శ్రీకారం

Bhavani

పతాక సన్నివేశాల చిత్రీకరణలో శ్రీరాజ్ బళ్ళా “నరసింహపురం”

Sub Editor

ప్రభుత్వ 108 వాహనాన్ని మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment