26.2 C
Hyderabad
September 9, 2024 16: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్

శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా నేడు దుర్గ‌మ్మ

mahalaxmi

శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 6వ రోజైన శుక్ర‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ ష‌ష్ఠి) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. జ‌గ‌జ్జ‌న‌నీ అయిన శ్రీమ‌హాల‌క్ష్మీ రూపంలో ఉన్న దుర్గామాత ఈ రోజున ఎరుపు రంగు దుస్తుల్లో భ‌క్తుల‌ను సాక్షాత్క‌రిస్తున్నారు. యాదేవీ స‌ర్వభూతేషు ల‌క్ష్మీరూపేణ సంస్థితా అంటే స‌మ‌స్త జీవుల్లోనూ ఉండే ల‌క్ష్మీ స్వ‌రూపం దుర్గాదేవి అని చండీ స‌ప్త‌శ‌తి చెబుతోంది. కాబ‌ట్టి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ల‌క్ష్మీదేవిని పూజిస్తే ఆ త‌ల్లి స‌ర్వ‌మంగ‌ళ కారిణిగా ధ‌న‌, ధాన్య‌, ధైర్య‌, విజ‌య‌, విద్య‌, సౌభాగ్య‌, సంతాన భాగ్యాల‌ను ప్ర‌సాదిస్తుంది. శ్రీమ‌హాల‌క్ష్మీదేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు నైవేద్యంగా పంచభోగాలైన పాయ‌సం, చ‌క్ర‌పొంగ‌లి, ల‌డ్డు, పులిహోర‌, ద‌ద్యోజ‌నాల‌ను నివేదిస్తారు

Related posts

31 వరకూ తెలంగాణలో జనతా కర్ఫ్యూ కొనసాగింపు

Satyam NEWS

ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’

Sub Editor 2

Leave a Comment