31.7 C
Hyderabad
April 18, 2024 23: 39 PM
Slider ఆంధ్రప్రదేశ్

గుంటూరులో కనకదుర్గమ్మ దేవాలయం కూల్చివేత

temple

గుంటూరు నడి బొడ్డున ఉన్న కనకదుర్గ దేవాలయాన్ని ప్రొక్లయినర్లతో కూల్చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఈ చర్యను మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా చేసేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లి శారదా మార్కెట్ ఎదుట కనకదుర్గమ్మ దేవాలయాన్ని రోడ్డు విస్తరణలో భాగంగా కార్పొరేషన్ సిబ్బంది కూల్చేసింది. ఏళ్ళ నాటి గుడిని కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రొక్లైనర్‌లతో కార్పొరేషన్ సిబ్బంది గుడిని నేలమట్టం చేసింది. కార్పొరేషన్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందుత్వాన్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారని దీనిలో భాగంగానే కనకదుర్గమ్మ దేవాలయాన్ని కూల్చివేశారని ఆరోపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు పుష్కరాల సమయంలో ఇలాంటి పనులే చేశారని, ఆయనకు ఏ గతి పట్టిందో జగన్‌కూ అదే గతి పడుతుందని హిందూ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Related posts

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

నష్ట పోయిన రైతులకు పరిహారం అందిస్తాం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS

Leave a Comment