34.2 C
Hyderabad
April 19, 2024 20: 58 PM
Slider ఖమ్మం

కంటి వెలుగు ఇంటికే వెలుగు

#kantivelugu

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని, కంటి వెలుగు పథకం మన ఇంటికే వెలుగు లాంటిది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  కొరారు.  ఖమ్మం కార్పోరేషన్ 15వ డివిజన్ అల్లిపురం రైతు వేదిక, 24వ డివిజన్ శాంతి నగర్ లోని మిషన్ హాస్పిటల్ నందు ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని ఆయన అన్నారు. రెండవ విడత కంటి వెలుగు ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయం, మాన్, కేసీఅర్  అధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.  ప్రజలు కంటి చూపును తక్కువ గా చూడవద్దు అని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకుని విజయవంతం చేయాలని అన్నారు.  కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆయా సౌకర్యాలు కల్పించి గ్రామంలో ఉన్న ప్రజలను కంటి పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా, అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని ఆయన తెలిపారు.

Related posts

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

Satyam NEWS

సీపీఎస్‌ రద్దు హామీ: 7 రోజులన్నారు..765 రోజులైంది

Satyam NEWS

ఎక్కువ పాల కోసం మల్టీ మినరల్ పిండి పదార్ధాలు వాడండి

Satyam NEWS

Leave a Comment