27.7 C
Hyderabad
April 24, 2024 09: 31 AM
Slider ఆధ్యాత్మికం

22 నుండి మార్చి 3వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

#TTD

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                            ఉదయం                                సాయంత్రం

22-02-2022      ధ్వజారోహణం(మీన‌లగ్నం)       హంస వాహనం

23-02-2022         సూర్యప్రభ వాహనం                  చంద్రప్రభ వాహనం

24-02-2022           భూత వాహనం                          సింహ వాహనం

25-02-2022           మకర వాహనం                          శేష వాహనం

26-02-2022          తిరుచ్చి ఉత్సవం                    అధికారనంది వాహనం

27-02-2022       వ్యాఘ్ర వాహనం                       గజ వాహనం

28-02-2022           కల్పవృక్ష వాహనం                 అశ్వవాహనం

01-03-2022            రథోత్సవం(భోగితేరు)               నందివాహనం

02-03-2022           పురుషామృగవాహనం               కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం 

03-03-2022           శ్రీనటరాజస్వామివారి                 రావణాసుర వాహనం,

                               సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం.     ధ్వజావరోహణం.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు  స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఫిబ్రవరి 20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం  :

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Related posts

తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని బిజెవైఎం డిమాండ్

Satyam NEWS

దళితుల భూముల్లో మెగా పార్కు నిర్మించవద్దు

Satyam NEWS

గణతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్

Satyam NEWS

Leave a Comment