ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రత్నాకర్ పండుగాయలకు హైదరాబాద్ కాపు జాగృతి కన్వీనర్ లలిత్ కుమార్ అభినందనలు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి తలలోనాలుకగా ఉండి ఎంతో మందికి సహాయం చేస్తున్న రత్నాకర్ కు పదవి ఇవ్వడం ద్వారా పని చేసే వారికే పదవులు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు అయిందని ఆయన తెలిపారు. అమెరికాలో తెలుగువారితో సన్నిహిత సంబంధాలు ఉన్న రత్నాకర్ పండుగాయల ను ఈ పదవిలో నియమించినందుకు ఆయన హర్షం వ్యక్తంచేశారు. రత్నాకర్ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్తించి రాష్ట్ర అభివృద్ధికోసం కృషిచేయాలని లలిత్ కుమార్ కోరారు. అణగారిన కాపు, బలిజ, వంటరి, తెలగ కులస్తులకు సహాయం చేసి వారి ఉన్నతికి పాటుపడాలని రత్నాకర్ ను ఆయన కోరారు.
previous post
next post