33.2 C
Hyderabad
April 26, 2024 02: 17 AM
Slider నెల్లూరు

బలిజ, కాపు, తెలగ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలి

#VenkatagiriMunicipality

బలిజ, కాపు, తెలగ కులస్తులలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ విద్యావేత్త, వి ఆర్ జె సి విద్యాసంస్థల అధినేత, డాక్టర్ సురేష్ కుమార్ గిండీ అన్నారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు, తెలగ  సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంతరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి హిదాయతుల్లా, వెంకటగిరి  సంస్థాన రాజకుటుంబీకులు, శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ముఖ్య నాయకులు, వార్డు కౌన్సిలర్ లు, శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు, తెలగ సంక్షేమ సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా వెంకటగిరి పట్టణంలో శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు, తెలగ సంక్షేమ సేవా సంఘం భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాల్సిందిగా సురేష్ కుమార్ గిండి స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ న్యాయవాది శ్రీ కృష్ణదేవరాయ బలిజ, కాపు, తెలగ సంక్షేమ సేవా సంఘం, వెంకటగిరి ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్  వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

కె. రమాకాంత్, వెంకటగిరి సామాన్యుడు

Related posts

రూప్ టాప్ సౌర విద్యుత్ఉత్పత్తికి ప్రోత్సాహాకం

Satyam NEWS

పెద్దల పెట్టుబడులు ఉన్న ప్రణీత్ గ్రూప్ పై ఐటి దాడి

Satyam NEWS

రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment