33.2 C
Hyderabad
April 26, 2024 02: 14 AM
Slider కరీంనగర్

విద్వేషం: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

#r s praveenkumar

హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేసిన సంఘటనలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ  గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరోస్ అధినేత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మేజిస్ట్రేట్ ఈ ఆదేశాలిచ్చారు.

కేసు వివరాల్లోకి వెళ్ళితే ఈ ఏడాది మార్చి లో పెద్దపల్లి జిల్లా జులపెల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో  స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆ సందర్భంలో స్వేరో సభ్యులతో కలిసి స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞలో హిందు దేవుళ్లు అయిన రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే గౌరీ మీద, గణపతి మీద ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధా కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.

స్వేరోస్ సభ్యులందరు ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా  ఎడమ చేతి చాచి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిందు దేవుళ్లను అవమానించి, కించపరిచే విధంగా వ్యవహరించి ప్రతిజ్ఞ చేసిన వీడియోను, పత్రికలో వచ్చిన వార్తను సేకరించి, ఆధారాలతో సహా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో మార్చి 16న ఫిర్యాదు చేశారు.

అయిదే దానిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై అధికారైన పోలీసు కమీషనర్ కు మార్చి 18న మరల ఫిర్యాదు చేశారు. అయితే వారు కూడా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో చివరికి 22న ప్రిన్సిపల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు లో న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోర్టులు సరిగా పని చేయకపోవడంతో ఇన్ని రోజులు పిటిషన్ పెండింగులో వస్తూ ఉన్నది.

చివరికి కేసు ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన  తరువాత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐ.పి.ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న స్వేరోస్ అధినేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వసాలను దెబ్బతీశాడని అన్నారు.

హిందువులకు, హిందు దేవుళ్లకు, దేశానికి వ్యతిరేకంగా సెక్యూలర్ ముసుగులో మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారని, వీళ్ళు ఎంతటివారైన విడిచిపెట్టేదిలేదని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

అలాగే స్వేరోస్ సంస్థ గురుకులాల విద్యార్థులకు ప్రతిజ్ఞలు చేపిస్తూ హిందు వ్యతిరేక భావజాలాన్ని పెంచుతూ హిందు దేవి దేవతల పట్ల విషం కక్కుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా విద్యార్థుల మెదడులో  ప్రవీణ్ కుమార్ విషబీజాలను నాటుతున్నాడని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

Related posts

తిరుమ‌ల శ్రీ‌వారి కైంక‌ర్యానికి పుష్ప ఉద్యాన‌వ‌నం

Satyam NEWS

స‌నాత‌న ధ‌ర్మాల‌ను భావిత‌రాల‌కు తెలియ‌జేయాలి

Satyam NEWS

కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment